స్పెక్ట్రం వేలం చెల్లింపులను(ఏజీఆర్ బకాయిలు) (VI AGR dues) నాలుగేళ్లు వాయిదా వేసేందుకు టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని కంపెనీ వెల్లడించింది. (Vodafone Idea AGR dues)
"కంపెనీ స్పెక్ట్రం వేలం బకాయిలను నాలుగేళ్ల కాలానికి(అక్టోబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2025) వాయిదా (Vodafone Idea AGR dues) వేయాలని బోర్డు నిర్ణయించింది" అని స్టాక్ ఎక్స్ఛేంజీకి ఇచ్చిన ఫైలింగ్‌లో పేర్కొంది. దీంతోపాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం ఇచ్చిన ఇతర ఆప్షన్లను కూడా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పరిశీలించనున్నారని తెలిపింది. (VI AGR dues)
షేర్ల జోరు
వొడాఫోన్ ఐడియా ప్రకటన తర్వాత మార్కెట్లో కంపెనీ షేర్లు 5.6శాతం పెరిగి ఒక దశలో రూ.10.56కు చేరాయి. ఇటీవల ప్రభుత్వం టెలికం రంగంలో కీలక సంస్కరణలు చేసింది. భారతీ ఎయిర్‌టెల్ వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో సంస్థలకు ఈమేరకు ఓ లేఖ రాసింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్ల మారిటోరియం విధించడంపై అక్టోబర్ 29లోపు అభిప్రాయం వెల్లడించాలని కోరింది. ఇక మారిటోరియం కాలానికి సంబంధించిన వడ్డీని ఈక్విటీగా మార్చడంపై కూడా 90 రోజుల్లో అభిప్రాయం చెప్పాలని పేర్కొంది.
ఇదీ చదవండి: