ETV Bharat / business

ర్యానిటిడిన్‌ వద్దే వద్దు... వినియోగిస్తే కాన్సర్​ ముప్పు! - Ranitidine tablet latest news

కడుపులో అల్సర్ల నివారణకు, వాటి వల్ల వచ్చే ఇతరత్రా అనారోగ్యాలకు వినియోగించే ర్యానిటిడిన్​ను అమెరికా విపణి నుంచి వెనక్కి తీసుకోవాలని ఔషధ సంస్థలకు యూఎస్‌ఎఫ్‌డీఏ (అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ) ఆదేశించింది. ఈ ఔషధాన్ని వినియోగిస్తే కాన్సర్‌ ముప్పు పొంచి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది.

USFDA directs pharmaceutical companies to withdraw Ranitidine completely from US market
ర్యానిటిడిన్‌ వద్దే వద్దు... వినియోగిస్తే కేన్సర్​ ముప్పు!
author img

By

Published : Apr 4, 2020, 6:48 AM IST

కడుపులో అల్సర్ల నివారణకు, వాటి వల్ల వచ్చే ఇతరత్రా అనారోగ్యాలకు ప్రపంచ వ్యాప్తంగా విసృతంగా వినియోగించే ‘ర్యానిటిడిన్‌’ను అమెరికా విపణి నుంచి పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఔషధ సంస్థలకు యూఎస్‌ఎఫ్‌డీఏ (అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ) నిర్దేశించింది. ఈ ఔషధాన్ని వినియోగిస్తే కాన్సర్‌ ముప్పు పొంచి ఉన్నట్లు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తేలినందున, ఈ మేరకు స్పష్టమైన సూచనలు ఇస్తున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ‘ర్యానిటిడిన్‌’ను నిషేధించలేదు కానీ పంపిణీ - విక్రయాలు వద్దని ఔషధ కంపెనీలకు సూచించింది. దీన్ని వినియోగిస్తే ముప్పు తలెత్తవచ్చని ప్రజలకు స్పష్టం చేసినట్లు అయింది. దీంతో మనదేశంలోనూ ఈ ఔషధ వినియోగంపై ఆంక్షలు విధించేందుకు డీసీజీఐ (డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) ముందుకు రావచ్చనే అభిప్రాయం సంబంధిత వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

ఇదీ ప్రధాన కారణం: ర్యానిటిడిన్‌ ఔషధాన్ని వాడొద్దని యూఎస్‌ఎఫ్‌డీఏ నిర్దేశించడానికి ప్రధాన కారణం, దీన్లో ఎన్‌-నైట్రోసొడిమెథైలమైన్‌ (ఎన్‌ఎండీఏ) అనే కాన్సర్‌ కారక మలినాలు ఉన్నట్లు నిర్ధారణ కావడమే. దాదాపు ఏడాదిన్నర క్రితం ఈ అనుమానంతోనే ఈ ఔషధం పంపిణీని కొంతకాలం పాటు యూఎస్‌ఎఫ్‌డీఏ నియంత్రించింది. ఆ తర్వాత కొంతకాలానికి పరిమితికి లోబడి ఎన్‌ఎండీఏ ఉన్నట్లయితే ర్యానిటిడిన్‌ వాడుకోవచ్చని పేర్కొంటూ, కొంత వెసులుబాటు కల్పించింది. తాజాగా దీనికి పూర్తి భిన్నమైన నిర్ణయం తీసుకుంది. ర్యానిటిడిన్‌ ఔషధం నిల్వ ఉండే కొద్దీ, దాన్లో ఎన్‌ఎండీఏ శాతం పెరుగుతున్నట్లు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో తేలినట్లు పేర్కొంది. ఏ ఔషధం ఎంతకాలం పాటు నిల్వ ఉందో కనిపెట్టలేం కాబట్టి, దీన్ని వాడటం అంటే ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకున్నట్లేనని విశ్లేషించింది. అందువల్ల దీన్ని మార్కెట్లో పంపిణీ చేయరాదని సూచిస్తున్నట్లు వివరించింది.

అన్ని దేశాలు పరిగణనలోకి

యూఎస్‌ఎఫ్‌డీఏ నిర్ణయాలను దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఔషధ నియంత్రణ సంస్థలు తమ దేశాల్లో పరిగణనలోకి తీసుకోవడం ఆనవాయితీ. అందువల్ల మనదేశ నియంత్రణ సంస్థ డీసీజీఐ ర్యానిటిడిన్‌ విషయంలో ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉన్నట్లు స్థానిక ఔషధ పరిశ్రమ వర్గాలు వివరించాయి. యూఎస్‌ఎఫ్‌డీఏ ర్యానిటిడిన్‌ ఔషధంలో కాన్సర్‌ కారక మలినాలు ఉన్నట్లు గతంలో తేల్చినప్పుడు, దీన్ని పరిశీలించాల్సిందిగా మనదేశంలోని ఫార్మా కంపెనీలకు డీసీజీఐ సూచించింది. దేశీయ ఫార్మా కంపెనీలు ఈ ఔషధాన్ని ప్రపంచ మార్కెట్‌కు, ముఖ్యంగా అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన కొన్ని ఫార్మా కంపెనీలతో పాటు బెంగుళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌ లిమిటెడ్‌ ర్యానిటిడిన్‌ తయారీ, విక్రయాల్లో అగ్రగామిగా ఉంది. స్ట్రైడ్స్‌ ఫార్మా యూఎస్‌ మార్కెట్లో అత్యధికంగా విక్రయించే 5 పెద్ద ఔషధాల్లో ర్యానిటిడిన్‌ ఒకటి. యూఎస్‌ఎఫ్‌డీఏ సూచనల మేరకు తాజాగా ఈ ఔషధాన్ని అమెరికా విపణి నుంచి వెనక్కి తీసుకుంటామని, పంపిణీని కూడా నిలుపుదల చేసినట్లు ఈ సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలంలో స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌, అమెరికాలో 180 మి.డాలర్ల (సుమారు రూ.1350 కోట్ల) అమ్మకాలను నమోదు చేసింది. ర్యానిటిడిన్‌ పంపిణీని నిలుపుదల చేస్తే అమెరికా ఆదాయాలు తగ్గే అవకాశం ఏర్పడుతుంది. ఇదే సమస్య ఇతర కంపెనీలకూ ఎదురవుతుంది. కానీ అమెరికా ఆదాయాలు తగ్గకుండా చూసుకుంటామని, అందుకు ఇతర ఔషధాలను వినియోగించుకుంటామని స్ట్రైడ్‌్్స ఫార్మా సైన్స్‌ వివరించింది. అమెరికాలో 123 ఔషధాలకు ఏఎన్‌డీఏ అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్లు, ఇందులో 85 ఔషధాలకు అనుమతులు ఉన్నట్లు పేర్కొంది.

ఇవీ ప్రత్యామ్నాయం

ర్యానిటిడిన్‌కు బదులు ఫమోటిడైన్‌ (పెప్సిడ్‌), సిమిటిడైన్‌ (టాగమెట్‌), ఈసోమిప్రజోల్‌ (నెగ్జియమ్‌), లాన్సోప్రజోల్‌ (ప్రెవాసిడ్‌), ఒమిప్రజోల్‌ (పిలోసెక్‌) ఔషధాలను వినియోగించుకోవచ్చని యూఎస్‌ఎఫ్‌డీఏ పేర్కొంది. ఈ ఔషధాల్లో ఎన్‌ఎండీఏ దాఖలాలు కనిపించలేదని తెలియజేసింది.

ఇదీ చూడండి : లాక్​డౌన్​ వేళ మనుషుల కదలికల్లో ఇంత మార్పా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.