ETV Bharat / business

బైక్ డిజైన్​ మీది.. తయారీ బాధ్యత మాది.. టీవీఎస్​ బంపర్ ఆఫర్!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్​ మోటార్ సంస్థ(TVS Motor) తమ వినియోగదారుల కోసం ప్రత్యేక సదుపాయాన్ని తీసుకువచ్చింది. వినియోగదారులు ముందుగా చెబితే వారికి నచ్చినట్లుగా బైకును డిజైన్​ చేసేందుకు బిల్డ్​-టు-ఆర్డర్​(Built-to-order platform) వేదికను అందుబాటులోకి తెచ్చింది.

author img

By

Published : Aug 31, 2021, 2:18 PM IST

Updated : Aug 31, 2021, 3:25 PM IST

TVS Motor
టీవీఎస్​ మోటార్ సంస్థ

మనం ఓ బైక్​ కొనగోలు చేస్తాం. కానీ, దాని రంగు, దాని మీద ఉండే గ్రాఫిక్స్​.. అలా కాకుండా వేరేలా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అయినా.. దాన్ని మనం మార్చుకోలేం. మరి మన బైక్ మనకు నచ్చినట్టుగా ముందే డిజైన్ చేసి ఉంటే ఎంతో బాగుంటుంది కదా? ఇదే ఆలోచనతో ముందుకొచ్చింది ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ. వినియోగదారుడికి నచ్చినట్టుగా తమ వాహనాలను ముందే డిజైన్​ చేసేలా.. 'బిల్ట్​-టు-ఆర్డర్​'(Built-to-order platform) వేదికను తీసుకువచ్చినట్లు మంగళవారం ప్రకటించింది.

ఈ వేదిక ద్వారా వినియోగదారులు తమకు అనుకూలంగా ఉండే బైకులను కొనుగోలు చేయవచ్చని టీవీఎస్​ మోటార్ సంస్థ తెలిపింది. టీవీఎస్​ అపాచీ ఆర్​ఆర్​ 310 బైకుల కోసం ఈ ప్లాట్​ఫామ్​ను తీసుకురానున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా వినియోగాదారులు ప్రీసెట్​ కిట్లను, గ్రాఫిక్స్, రిమ్​ రంగులు, పర్సనలైజ్డ్​ రేస్​ నంబర్లను తమకు కావాల్సినవి ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొంది.

దశలవారీగా ఈ సదుపాయాన్ని తమ మిగతా వాహనాలకు టీవీఎస్​ మోటార్ కంపెనీ వర్తింపజేయనుంది. "ప్రతి వినియోగదారుడికి తమ వాహనాలకు సంబంధించి విభిన్నమైన ఆలోచన ఉంటుంది. ఈ వేదిక ద్వారా మా వినియోగదారులకు తమ అవసరాలకు తగ్గ వాహనాలను తాము సొంతం చేసుకోగలరు" అని టీవీఎస్​ మోటార్ సంస్థ ప్రీమియమ్​ మోటార్ సైకిల్స్​ మార్కెటింగ్​ హెడ్​ మేఘశ్వామ్​ దిఘోలే పేర్కొన్నారు.

ఇదీ చూడండి: స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి ఇది సరైన సమయమేనా?

ఇదీ చూడండి: Gold Rate Today: మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా..

Last Updated : Aug 31, 2021, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.