మొబైల్ నంబర్ పోర్టబిలిటీ నియమాల అమలు గడువును నవంబర్ 11 వరకు పొడిగిస్తూ టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. మొబైల్ నంబర్ మారకుండానే వేరే ఆపరేటర్‌కు మారే ఈ నూతన విధానానికి సెప్టెంబర్ 30 వరకు మాత్రమే గడువు ఉండగా.. తాజాగా దానిని ట్రాయ్ పెంచింది.
కొత్త ప్రక్రియలోకి మారేందుకు చాలా ముందస్తు పరీక్షలు చేయాల్సి ఉన్నందున గడువు పొడిగించాలని టెలికాం ఆపరేటర్లు, సర్వీస్ ప్రొవైడర్లు ట్రాయ్‌కు విజ్ఞప్తి చేశారు. తక్కువ సమయంలో ఈ పరీక్షలు అన్నీ చేయడం సాధ్యం కాదని అవి వివరించడం వల్ల ట్రాయ్ తాజా నిర్ణయం తీసుకుంది.
నిబంధనలు సులభతరం చేస్తూ...
మొబైల్ నంబర్ పోర్టబిలిటీని మరింత సులభతరం చేస్తూ ట్రాయ్ 2018 డిసెంబర్లో నిబంధనలు రూపొందించింది. మొత్తం ప్రక్రియను వేగంగా పూర్తి చేయడం సహా ఇది పూర్తి కావడానికి ఉన్న గడువును 7 రోజుల నుంచి 2 రోజులకు తగ్గిస్తూ నిబంధనల్లో మార్పు చేసింది.
ఇదీ చూడండి: బంపర్ ఆఫర్: మారుతీ 'బాలెనో ఆర్ఎస్'పై భారీ తగ్గింపు