ETV Bharat / business

business leaders: అప్పు చేసి మొదలు పెట్టి.. విజేతలుగా నిలిచి - ప్రముఖ వ్యాపారవేత్తలు

తొలి అడుగు ఎప్పుడూ ఒంటరే. ఆత్మస్థైర్యమే (inspirational business leaders) దానికి అండ. తప్పనిసరి పరిస్థితుల్లో ఏ దారీ తోచనప్పుడు ధైర్యమే తోడుగా వేసిన తొలి అడుగులు.. కొందరి ప్రయాణాన్ని ఊహించని గమ్యాలకు చేరుస్తాయి. ఈ వ్యాపారవేత్తల ప్రయాణం అలా మొదలైందే. తమ కాళ్ల మీద తాము నిలబడే క్రమంలో అప్పుచేసి చిన్నగా మొదలుపెట్టిన వ్యాపారాలు కాల పరీక్షలను తట్టుకుని నిలిచాయి. దేశప్రతిష్ఠను ఇనుమడింపజేసే స్థాయికి ఎదిగాయి. కృషీ పట్టుదలా వారిని విజేతలుగా నిలిపితే వారి విజయప్రస్థానం మరెందరికో స్ఫూర్తిపాఠం అవుతోంది..!

inspirational business leaders
భారత్​లో ప్రముఖ వ్యాపారవేత్తలు
author img

By

Published : Nov 14, 2021, 12:56 PM IST

వ్యాపారం చేయాలంటే దానికో ప్రణాళిక ఉండాలి, మార్కెట్‌ని (inspirational business leaders) అధ్యయనం చేయాలి, పెట్టుబడి పెట్టే సంస్థల్ని వెతుక్కోవాలి, ప్రారంభించడానికి సరైన చోటేదో తెలుసుకోవాలి.. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అనుభవజ్ఞులు చెప్పే పాఠాలివి! అవేవీ లేకుండానే అవసరమో ఆశయమో వీరిని వ్యాపారవేత్తల్ని చేశాయి. సవాళ్లకు వెరవక ముందుకు సాగే ధైర్యమూ తెగువా ఇతరులకన్నా విభిన్నంగా నిలిపాయి. వారి కష్టాన్ని బ్రాండ్‌ వాల్యూగా మార్చి ప్రపంచానికి చాటాయి. విజేతలను చేశాయి!

సేల్స్‌మ్యాన్‌... 400 కోట్ల టర్నోవర్‌

inspirational business leaders
ప్రకాశ్‌ అగర్వాల్‌

దుకాణంలో రోజంతా నిలబడివుండి వచ్చిన (inspirational business leaders in india) వాళ్లకి బట్టలు చూపించి, వాళ్లు వెళ్లగానే గుట్టలుగా పడివున్న ఆ బట్టలన్నీ మడతపెట్టడం, మళ్లీ మరో కస్టమర్‌ రాగానే ఒక్కోటీ తీసి వాళ్ల ముందు పరవడం.. ఆ పని ప్రకాశ్‌ అగర్వాల్‌కి ఎంత నీరసం తెప్పించేదో అతని మనసులో అంత కసినీ పెంచింది. ఈ కష్టమేదో సొంత వ్యాపారానికి పడితే జీతం పాటి సంపాదించుకోలేనా అనుకున్నాడు. అనుకున్నదే తడవు ఉద్యోగం మానేసి ధీమాగా ఇంటికొచ్చిన ప్రకాశ్‌ సబ్బులూ డిటర్జెంట్లూ తలనూనెలూ.. ఒకదాని తర్వాత ఒకటి చొప్పున తయారుచేసి అమ్మే ప్రయత్నాలు చేశాడు. కానీ ఏదీ విజయం సాధించలేదు.

ప్రయోగాలు చేస్తూ కాలక్షేపం చేయడానికి వాళ్లదేమీ కలిగిన కుటుంబం కాదు. తండ్రి లేడు. ఇద్దరు తమ్ముళ్ల బాధ్యతా పెద్ద కొడుకైన ప్రకాశ్‌దే. మళ్లీ బట్టల షాపుకే వెళ్లి ఉద్యోగం అడగమంది తల్లి. ప్రకాశ్‌కి ఆత్మాభిమానం అడ్డొచ్చింది. 'అయితే ఒక పని చెయ్యి. అగరుబత్తీలకైతే నిత్యం డిమాండు ఉంటుంది. తయారీ, అమ్మకాలూ నీవల్ల కాదు కానీ పంపిణీ తీసుకుని షాపులకు సప్లై చెయ్యి' అని సలహా ఇచ్చింది తల్లి. పంపిణీ కాదు, తయారుచేసి అమ్ముతానని తల్లికి నచ్చజెప్పాడు ప్రకాశ్‌. 1992 నాటి సంగతిది. బంధువుల దగ్గర ఐదు లక్షలు అప్పుతెచ్చి పెరట్లో చిన్న పాక వేసుకుని ముగ్గురన్నదమ్ములూ కలిసి అగర్‌బత్తీల తయారీ మొదలెట్టారు. 'మైసూర్‌ దీప్‌ పర్‌ఫ్యూమరీ హౌస్‌' అని కంపెనీ నమోదు చేసి తయారుచేసిన అగర్‌బత్తీలకు 'పూరబ్‌ పశ్చిమ్‌ ఉత్తర్‌ దక్షిణ్‌' అని పేరు పెట్టాడు. తీరా ఆ ప్యాకెట్లను తీసుకుని దుకాణాలకు వెళ్తే- 'మైసూర్‌ పేరు పెట్టినంత మాత్రాన ఇండోర్‌లో తయారుచేసినవి ఎవరూ కొనరు, బెంగళూరులోనో మద్రాసులోనో తయారైన అగరుబత్తీలకే ఇక్కడ డిమాండ్‌' అన్నారు దుకాణదారులు. ఆ మాట విని ఒక్కసారిగా నీరసం ముంచుకొచ్చినా ప్రకాశ్‌ పట్టువదలలేదు. వాడి చూశాక చెప్పమనేవాడు. అలా స్థానిక ప్రజల అభిరుచులకు తగిన సువాసనలతో అగర్‌బత్తీలను తయారుచేస్తూ మార్కెట్‌లో పట్టుసాధించడానికి అతడికి ఐదారేళ్లు పట్టింది. అప్పుడిక విడిగా భవనం అద్దెకు తీసుకుని ఫ్యాక్టరీ పెట్టాడు. మామూలు అగరుబత్తీలే కాకుండా కాస్త ప్రత్యేకంగా ఏమన్నా చేయాలని ప్రయత్నించి ఆహ్లాదకరమైన పరిమళం చాలాసేపు ఉండేలా 'జెడ్‌ బ్లాక్‌' పేరుతో కొత్త బ్రాండ్‌ అగరుబత్తీల్ని తయారుచేశాడు. అది వెంటనే క్లిక్‌ అయింది. అమ్మకాలు బాగా పెరిగి ఇక అంతా బాగుందనుకుంటుండగా అగ్నిప్రమాదంలో మొత్తం ఫ్యాక్టరీ కాలి బూడిదయింది. దాంతో మరోసారి సున్నానుంచి మొదలుపెట్టక తప్పలేదు. కాకపోతే వ్యాపారంలో అనుభవం వచ్చింది కాబట్టి ఈసారి ధైర్యంగా అప్పుచేసి మళ్లీ సంస్థని నిర్మించుకున్నారు. ఇప్పుడు మనదేశంలో అమ్ముడయ్యే అగర్‌బత్తీల్లో మొదటి ఐదు బ్రాండ్లలో జెడ్‌ బ్లాక్‌ ఒకటి. ప్రకాశ్‌ తన సంస్థ ద్వారా అగర్‌బత్తీలతో పాటు రకరకాల పరిమళ ద్రవ్యాలూ, నూనెలూ, అప్పడాలూ, సోయా ఉత్పత్తులనీ తయారుచేస్తున్నాడు. ఐదు తయారీకేంద్రాల్లో మూడువేల మందికి ఉపాధి కల్పించాడు. 550 మెషీన్లతో 2018లో ప్రారంభించిన యూనిట్‌ ప్రపంచంలోనే ఈ తరహా తయారీ కేంద్రాల్లో పెద్దది. ఇప్పుడు రోజుకు మూడు కోట్ల అగర్‌బత్తీలను తయారుచేస్తున్న ఈ సంస్థ రూ. 400 కోట్లకు పైగా టర్నోవరు సాధించి దేశీయ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తూనే 60 దేశాలకు ఎగుమతి చేస్తోంది.

ఒకప్పుడు.. కేరాఫ్‌ రైల్వే ప్లాట్‌ఫామ్‌!

inspirational business leaders
సత్యనారాయణ్‌

సత్యనారాయణ్‌ వయసు (top 10 business leaders) అప్పుడు పద్నాలుగేళ్లు. బడికెళ్తున్న అతడిని తండ్రి పిలిచి సంసారాన్ని పోషించడం తనవల్ల కాదనీ, ఎవరి తిండి వాళ్లు సంపాదించుకోవలసిందేననీ చెప్పాడు. కూలి పని ఒకరోజు దొరికితే ఒకరోజు దొరకడం లేదు, ఆయన మాత్రం ఏం చేస్తాడు. దాంతో బడిమానేసి సత్యనారాయణ్‌ చిన్నా చితకా పనులు చేయడం మొదలెట్టాడు. అది చూసిన బంధువు ఒకరు నాగ్‌పుర్‌లో అయితే బాగా పనులు దొరుకుతాయి రమ్మన్నాడు. రాజస్థాన్‌ నుంచి బయల్దేరి రావడమైతే వచ్చాడు కానీ అతని చేతిలో రూపాయి లేదు, ఆ అబ్బాయికి ఆశ్రయమిచ్చే స్తోమత బంధువుకు లేదు. దాంతో పగలంతా పనిచేసి రాత్రి రైల్వేస్టేషన్‌లో పడుకునేవాడు. చల్లటి ఆ సిమెంటు బెంచీల మీద పడుకుని ఆకాశంలో చుక్కల్ని చూస్తూ ఏనాటికైనా తనకంటూ ఒక నీడ ఏర్పరుచుకోగలనా అని ఆలోచించేవాడు సత్యనారాయణ్‌. ఓరోజు ఇద్దరు వ్యక్తులు దగ్గరలో ఒక గోడౌన్‌ ఖాళీగా ఉందనీ గతంలో అక్కడ పేలుడు పదార్థాలను నిల్వ చేసేవారనీ నెలకు వెయ్యి రూపాయలు ఇస్తే లైసెన్సు అద్దెకు ఇస్తారనీ తమ దగ్గర అంత డబ్బు లేదనీ అనుకోవడం విన్నాడు. పేలుడు పదార్థాల గురించి తనకేమీ తెలియకపోయినా ఎందుకో ధైర్యం చేయాలనిపించింది. బంధువు సాయంతో అతి కష్టమ్మీద వెయ్యి రూపాయలు జమచేసి ఆ లైసెన్సు పొందాడు. వ్యాపారంలో మెలకువలు నేర్చుకుని కొన్ని సంవత్సరాలు ప్రభుత్వ గనులకీ, ఫ్యాక్టరీలకీ పేలుడు పదార్థాలను సరఫరా చేస్తూ వారి నమ్మకాన్ని పొందాడు. పర్వాలేదు, ఇక జీవితం గాడిలో పడినట్లేనని భావించి పెళ్లి చేసుకుని అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. కానీ, కొన్నాళ్లకే పరిస్థితులు మారిపోయాయి. వ్యాపారంలో పోటీ పెరిగింది. కొని, అమ్మే ధరల మధ్య ఎక్కువ వ్యత్యాసం లేకపోవడంతో ఆదాయం అంతంతమాత్రమై ఇల్లు గడవడమూ కష్టమయ్యేది. ఇలా లాభం లేదనుకున్న సత్యనారాయణ్‌ కొని అమ్మడం కాకుండా తానే ఉత్పత్తి చేయాలనుకున్నాడు. భార్య నగలు అమ్మి, అప్పులు చేసి 1995లో 'సోలార్‌ ఇండస్ట్రీస్‌' పేరుతో చిన్నగా ఫ్యాక్టరీ పెట్టాడు. క్రమక్రమంగా దాని స్థాయినీ ఉత్పత్తుల్లో వైవిధ్యాన్నీ పెంచుతూ పోయాడు.రకరకాల పేలుడు పదార్థాలను తయారుచేసి అవసరమైనవారికి సరఫరా చేసే సత్యనారాయణ్‌ కేవలం తన సమర్థతతో దేశంలోని పేలుడు పదార్థాల మార్కెట్లో నాలుగో వంతును తన సంస్థ ఆధ్వర్యంలోకి తెచ్చుకున్నాడు. పదిహేనేళ్ల క్రితమే పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లిన ఈ సంస్థ గత ఏడాది రెండున్నర వేల కోట్ల ఆదాయం సంపాదించింది. భారత రక్షణశాఖతో పాటు ఇస్రో, ఇతర అంతరిక్ష పరిశోధనా సంస్థలూ, మైనింగ్‌, నిర్మాణ సంస్థలూ ‘సోలార్‌ ఇండస్ట్రీస్‌’ నుంచే పేలుడు సామగ్రిని కొంటున్నాయి. దేశంలోనూ బయటా ఇప్పుడు ఈ సంస్థకి 25 ఉత్పత్తి కేంద్రాలుండగా 50 దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఏడాదికి 3 లక్షల టన్నులకు పైగా పేలుడు పదార్థాలు తయారుచేసి దేశంలో అంత స్థాయిగల మొదటి కంపెనీగా చరిత్ర సృష్టించింది ‘సోలార్‌ ఇండస్ట్రీస్‌’.

మసాలా దినుసుల నుంచి మలబార్‌ దాకా..

inspirational business leaders
అహమ్మద్‌

అహమ్మద్‌కి చదువు (successful business leaders biography) ఒంటపట్టలేదు. ఇంటర్‌ వరకూ ఎలాగో లాగించి ఆ తర్వాత తండ్రికి వ్యాపారంలో సాయంచేయడం మొదలెట్టాడు. కేరళకు చెందిన ఆ మధ్య తరగతి కుటుంబానికి సుగంధ ద్రవ్యాల వ్యాపారం ఉంది. ఒకసారి వ్యాపారంలోకి దిగాక ఆ మెలకువలన్నీ ఇట్టే నేర్చేసుకున్నాడు అహమ్మద్‌. మిరియాలు, దాల్చిన చెక్క, కొబ్బరినూనె లాంటి సరుకుల్ని హోల్‌సేల్‌గా కొని కోళికోడ్‌లోని రీటైల్‌ దుకాణాలకు సరఫరా చేసేవాడు. వ్యాపారంలో డబ్బు సంపాదించడం మీద కన్నా వినియోగదారుల నమ్మకానికీ సరుకు నాణ్యతకీ ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవాడు. దాంతో ఇతర నగరాల వ్యాపారస్తులు కూడా అతడిని వెతుక్కుంటూ వచ్చేవారు.

ఓసారి అలా సరుకు తీసుకెళ్లిన ముంబయి వ్యాపారి ఒకరు ఏ కారణంగానో ఆర్థికంగా బాగా దెబ్బతిని అహమ్మద్‌కు డబ్బు బాకీపడ్డాడు. తాను వ్యాపారాన్ని మూసేస్తున్నాననీ, తన బ్రాండ్‌ని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో అప్పు తీరుస్తాననీ హామీ ఇచ్చాడు. అతడు అప్పుతీర్చగలడా లేదా అన్న ఆలోచన కన్నా బ్రాండ్‌ని అమ్ముతానన్న మాట అహమ్మద్‌ని ఆకట్టుకుంది. మొదటిసారి విన్న ఆ మాట గురించి చాలామందిని అడిగి వివరాలు సేకరించాడు. నమ్మకమే పెట్టుబడిగా వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తే వ్యాపారానికి బ్రాండ్‌ విలువ వస్తుందని తెలిసింది.

అహమ్మద్‌కి తానూ అలాంటి ఒక బ్రాండ్‌ని నిర్మించాలన్న పట్టుదల పెరిగింది. కేవలం కొని, అమ్మే మసాలా దినుసుల వ్యాపారంలో అది సాధ్యం కాదని కొత్త వ్యాపారం ఏదైనా చేయాలనుకున్నాడు. బట్టలూ చెప్పులూ అన్నిటికీ ఏదో ఒక బ్రాండ్‌ పేరు కన్పించేది. చూడగా చూడగా బంగారానికే అలాంటిదేదీ కన్పించలేదు. కేరళలో ఏ పక్క చూసినా స్వర్ణకారులు ఎవరికి వారు పెట్టుకున్న చిన్న చిన్న దుకాణాలు తప్ప చెప్పుకోడానికి మంచి పేరున్న దుకాణం ఏదీ లేదు. దాంతో ఆ రంగంలోకి వెళ్లాలనుకున్నాడు. కానీ, బంగారం అంటే మాటలు కాదు, బోలెడు డబ్బు కావాలి. తన ఒక్కడి వల్ల కాని పని. ధైర్యం చేసి బంధువుల్ని సంప్రదించాడు. అప్పటికే అహమ్మద్‌కి నమ్మకస్తుడన్న పేరుండటంతో పెట్టుబడి పెట్టడానికి ఏడుగురు ముందుకొచ్చారు. అందరూ కలిసి స్థిరాస్తులు అమ్మి 50 లక్షలు సమకూర్చారు. ఆ డబ్బుతో 1993లో కాలికట్‌లో తమ ప్రాంతం పేరు మీదుగా 'మలబార్‌' గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌' దుకాణాన్ని ప్రారంభించాడు అహమ్మద్‌. బంగారు కడ్డీలను కొని స్వర్ణకారుల చేత చక్కటి డిజైన్లలో ఆభరణాలను చేయించి అమ్మేవాడు. ఎంచుకోవడానికి ఎక్కువ డిజైన్లతో కొత్తగా వెలసిన ఈ షాపు కొద్దికాలంలోనే వినియోగదారులను ఆకట్టుకుంది. ఆదరణ పెరగడంతో మరో రెండు పట్టణాల్లోనూ శాఖలు ప్రారంభించాడు. నాణ్యతలో రాజీపడకుండా ఉంటేనే వినియోగదారుల నమ్మకాన్ని పొందవచ్చని భావించిన అహమ్మద్‌ బంగారం ధర, తూకం, నాణ్యత విషయాల్లో పారదర్శకత పాటించేవాడు, కేరళ రాష్ట్రానికి హాల్‌మార్క్‌ ఆభరణాలను పరిచయం చేశాడు. దాంతో ఇక వెనక్కితిరిగి చూసుకునే అవసరం లేకుండా 'మలబార్‌' ఒక బ్రాండుగా ఇతర రాష్ట్రాలకూ, విదేశాలకూ విస్తరించింది. ఇప్పుడు పది దేశాల్లో 260 షోరూమ్‌లతో 27వేల కోట్ల విలువ సంపాదించుకున్న మలబార్‌ యజమాని ఒకప్పటి సుగంధద్రవ్యాల వ్యాపారి అంటే నమ్మగలమా..!

స్వదేశీ వైద్య ఉపకరణాలు..!

inspirational business leaders
సురేశ్‌ వజీరానిని

డెబ్బయ్యవ దశకంనాటి సంగతిది. మంచి ఉద్యోగం (business leadership skills) వస్తే అందులో చేరకుండా సర్వోదయ ఉద్యమంలో తలమునకలుగా ఉన్న ఇరవై ఒక్కేళ్ల సురేశ్‌ వజీరానిని అవినీతీ అక్రమాలకు వ్యతిరేకంగా మొదలైన నవనిర్మాణ్‌ ఆందోళన్‌ ఆకట్టుకుంది. బిహార్‌ నుంచి ముంబయి వచ్చిన ఆ ఉద్యమనేత జయప్రకాశ్‌ నారాయణ్‌తో కలిసి తిరుగుతుండగా అకస్మాత్తుగా ఆయన అనారోగ్యం పాలయ్యారు. వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాడు సురేశ్‌. ఆయన మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతినడంతో అత్యవసరంగా డయాలసిస్‌ చేయాలన్నారు వైద్యులు. ఆ ఆస్పత్రిలో విదేశాల నుంచి తెప్పించిన డయాలసిస్‌ మిషన్‌ ఉంది కానీ చెడిపోయింది, మరమ్మతు చేసే ఇంజినీరు అందుబాటులో లేడు. ఎలక్ట్రికల్‌ ఇంజినీరైన సురేశ్‌ ప్రయత్నించి ఆ యంత్రానికి రిపేరు చేసి గండం గట్టెక్కించాడు. ఈ సంఘటన సురేశ్‌ని ఆలోచింపజేసింది. తాను లేకపోతే పరిస్థితి ఏమయ్యేదీ, వైద్య పరికరాలను నిర్వహించే సాంకేతిక సేవలు అందుబాటులో లేక రోజూ ఎంతమంది రోగులు ఇబ్బంది పడుతున్నారూ.. అన్న ఆలోచన రాగానే వివిధ ఆస్పత్రుల్లో పరిస్థితులను పరిశీలించాడు.
ఆ అనుభవం అతడిని ఉద్యమ కార్యకర్త నుంచి వ్యాపారవేత్తగా మార్చింది. 1979లో సురేశ్‌ 'ట్రాన్స్‌ఏషియా బయో మెడికల్స్‌' అనే సంస్థని నెలకొల్పాడు. అందులో తన పెట్టుబడి రూ.250 కాగా స్నేహితుడు ఇచ్చిన అప్పు రూ.లక్ష. ఎంబీఏలో క్లాస్‌మేట్‌ అయిన జపాను స్నేహితుడి సాయంతో అక్కడి కంపెనీతో చర్చలు జరిపి జపాన్‌లో తయారైన యంత్రాలను ఇక్కడ పంపిణీ చేస్తూ, వాటి నిర్వహణ, మరమ్మతు సేవలను కూడా అందించేవాడు సురేశ్‌. ఆరోజుల్లో ఆఖరికి బ్లడ్‌టెస్ట్‌కి ఉపయోగించే మిషన్‌ కూడా విదేశాలనుంచే దిగుమతి చేసుకోవాల్సివచ్చేది. 17 కిలోల ఆ మిషన్‌ని భుజాన వేసుకుని ఒక్కో ఆస్పత్రికీ మోసుకెళ్లి ఎలా పనిచేస్తుందో చూపించి ఆర్డర్లు తీసుకునేవాడు సురేశ్‌. అలా కష్టపడి పనిచేస్తే నిలదొక్కుకోవడానికి మూడేళ్లు పట్టింది. ఓపక్క పెరుగుతున్న జనాభా మరోపక్క అంతంతమాత్రంగా ఉన్న వైద్య సదుపాయాలు. ముంబయిలాంటి నగరాల్లో తప్ప ఆధునిక వైద్య సౌకర్యాలూ పరీక్షలు చేసే పరికరాలూ జిల్లా స్థాయిలో ఎక్కడా అందుబాటులో లేని పరిస్థితి సురేశ్‌ని ఆందోళనకు గురిచేసింది. దాంతో తమ సంస్థలోనే పరిశోధన, అభివృద్ధి విభాగాన్ని నెలకొల్పి సొంతంగా వైద్య ఉపకరణాల తయారీ ప్రారంభించాడు. అందుబాటు ధరలో, స్వదేశీ సాంకేతికతతో ఈ సంస్థ తయారుచేసిన పలురకాల పరికరాలను డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో వాడుతున్నారు. ఇప్పుడు దేశంలో ప్రతి రెండు సెకన్లకీ ట్రాన్స్‌ఏషియా కంపెనీ తయారుచేసిన పరికరాన్ని ఉపయోగించి ఏదో ఒక వైద్య పరీక్ష జరుగుతోంది. ఏటా 150 కోట్ల రక్తపరీక్షలను ఈ పరికరాల సాయంతోనే చేస్తున్నారు. వెయ్యి కోట్ల కంపెనీగా అభివృద్ధి చెందిన ట్రాన్స్‌ఏషియా నమ్మకమైన స్వదేశీ సంస్థగా పేరు తెచ్చుకుంది, విదేశాలకూ తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.

అవసరం.. ఆవిష్కర్తని చేసింది!

inspirational business leaders
మహేశ్‌ గుప్తా

మహేశ్‌ గుప్తా చదువుకున్నది మెకానికల్‌ ఇంజినీరింగ్‌. పెట్రోల్‌ని ఆదా చేసే పరికరాల తయారీ అతడికి ఇష్టమైన విషయం. కానీ మంచినీటిని వడకట్టే ఓ పరికరం తాను తయారుచేయాల్సి వస్తుందని కానీ, అది దేశంలోనే నీటి శుద్ధి పరికరాల మార్కెట్‌ని మలుపు తిప్పుతుందని కానీ అతడు ఊహించలేదు. అవసరం అతడిని ఆవిష్కర్తని చేస్తే పట్టుదల విజయం వైపు నడిపించింది. వాటర్‌ ప్యూరిఫయర్ల మార్కెట్‌లో 'కెంట్‌' నమ్మదగిన బ్రాండ్‌గా నిలవడానికి కారణం- దానికి కర్త, కర్మ, క్రియ... అన్నీ అతడే కావడం..! మహేశ్‌ గుప్తా పెరట్లో రూపుదిద్దుకున్న పరికరం మార్కెట్లోకి ప్రవేశించి, బ్రాండ్‌గా విస్తరించి, 830 కోట్ల టర్నోవరు ఉన్న కంపెనీగా ఎదిగిన కథ ఆసక్తికరం.కాన్పూర్‌ ఐఐటీ నుంచి పట్టా పుచ్చుకుని, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం నుంచి పీజీ చేసిన మహేశ్‌ గుప్తా ఇండియన్‌ ఆయిల్స్‌ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఏడేళ్లు పనిచేశాక సొంతంగా దిల్లీలో 'ఎస్‌ఎస్‌ ఇంజినీరింగ్‌' సంస్థని ప్రారంభించాడు. పెట్రోలును ఆదా చేసే పరికరాలు తయారుచేస్తూ వ్యాపారంలో నిలదొక్కుకుంటుండగా పిల్లలిద్దరూ జాండిస్‌ బారినపడ్డారు. నీటికాలుష్యమే దానికి కారణమనీ, మార్కెట్లో ఉన్న మంచినీటి శుద్ధి పరికరాలేవీ నీటిలో కరిగిన కాలుష్యాలను తొలగించవనీ తెలుసుకున్నాడు మహేశ్‌. ఆర్‌వో(రివర్స్‌ ఆస్మోసిస్‌) విధానమైతే బాగా పనిచేస్తుంది కానీ అలాంటి పరికరాలేవీ మార్కెట్లో లేవు. అందుకని స్వయంగా ప్రయోగాలు చేసి, ఓ పరికరాన్ని తయారుచేశాడు. దాన్ని ఇంట్లో వాడి చూస్తే మంచి ఫలితం కనిపించింది. వాటర్‌ ప్యూరిఫయర్ల తయారీనే వ్యాపారంగా చేపడితే సమాజానికీ ఉపయోగపడుతుందన్న ఆలోచన వచ్చింది. పరికరాన్ని మరింతగా అభివృద్ధి చేసి 'కెంట్‌ ఆర్‌వో సిస్టమ్స్‌' ప్రారంభించాడు. మార్కెట్లో నాలుగువేలకు మామూలు ఫిల్టర్‌ అందుబాటులో ఉండడంతో 20వేలు పెట్టి ఖరీదైన ఫిల్టర్‌ని కొనడానికి ఎవరూ సాహసించలేదు. దాంతో, దీన్ని నమ్ముకుని పొరపాటు చేశానా అన్న ఆందోళన కాసేపు.. ఉపయోగపడే పరికరం కాబట్టి అమ్ముడవుతుందన్న ధీమా కాసేపు.. ఎటూ తేల్చుకోలేక కొన్నాళ్లు గడిపాడు. నష్టాలేమో పెరిగిపోతున్నాయి. చివరికి ధైర్యం చేసి ప్రకటనల మీద దృష్టిపెట్టాడు. మహేశ్‌ అనుకున్నట్లుగానే సినీనటి హేమమాలినితో ప్రకటన ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఏడాది తిరిగే సరికల్లా 30 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు మూడుచోట్ల తయారీ కేంద్రాలతో, మార్కెట్లో 40శాతం వాటాతో కెంట్‌ ముందుకు సాగుతోంది. ఎయిర్‌ ప్యూరిఫయర్స్‌, ఇతర వంటింటి పరికరాల తయారీ కూడా చేపట్టిన మహేశ్‌ నమ్మకమే తనని ముందుకు నడిపించిందంటాడు.

ఇదీ చదవండి:E Commerce sales: పండగ సీజన్​లో రూ.65వేల కోట్ల విక్రయాలు

స్టాక్ మార్కెట్లోనూ ఈ హీరోయిన్స్ హిట్- ఒక్కరోజులో 10 రెట్లు లాభం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.