tata cars holi offers : హోలీ పండగ సందర్భంగా టాటా మోటార్స్ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. తమ ఉత్పత్తులు అయిన టియాగో, టిగోర్, హ్యారియర్ లాంటి కార్లపై డిస్కౌంట్లను అందిస్తున్నట్లు తెలిపింది. మార్చి నెలలో ఈ కార్లను కొనుగోలు చేసిన వారికే ఈ హోలీ ఆఫర్ వర్తించనుంది.
మార్చిలో ఏఏ కార్లపై ఎంత డిస్కౌంట్..?
ఎంవై 2021 మోడల్లో వచ్చిన టాటా హ్యాచ్‌బ్యాక్ టియాగోపై రూ. 10,000 క్యాష్ బ్యాక్ను అందిస్తుంది. ఎంవై 2022 కార్ల కింద సుమారు రూ. 15 వేల వరకు క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వనుంది సంస్థ. దీనితో పాటు మరో రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపును కూడా వినియోగదారులు పొందవచ్చు. అయితే ఈ ఆఫర్లు కేవలం పెట్రోల్ వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తాయిని సంస్థ తెలిపింది.
టాటా టిగోర్ మీద కూడా ఇలాంటి డిస్కౌంట్లు ప్రకటించింది సంస్థ. సుమారు రూ. 10 వేల వరకు క్యాష్ బ్యాక్ను అందిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో మరో రూ. 15 వేల క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది. కార్పొరేట్ డిస్కౌంట్ కింద మరో రూ. 3వేల వరకు అందస్తుంది. టిగోర్లో కేవలం పెట్రోల్ వేరియంట్లకే ఈ ఆఫర్లు వర్తించనున్నాయి.
టాటా నెక్సాన్ లోని ఐసీఈ డీజిల్ వేరియంట్లలో రూ. 15 వేల ఎక్స్ఛేంజ్ బోనస్ ఇవ్వనుంది. పెట్రోల్ వేరియంట్లపై కూడా ఇదే ఆఫర్ అందించనుంది. పెట్రోల్ వేరియంట్లో రూ. 3 వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ను అందిస్తుంది. డీజిల్ వేరియంట్లపై ఈ డిస్కౌంట్ రూ. 5 వేల వరకు ఉంది.
ఇదిలా ఉంటే టాటా హ్యారియర్ కార్లపై రూ. 20 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ప్రకటించింది సంస్థ. ఎక్స్ఛేంజ్ ఇన్సెంటివ్ కింద రూ. 40 వేలు ఇస్తుంది. దీనిలో కూడా కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5 వేల వరకు ఉంది.
ఇదీ చూడండి: