నష్టాల్లోకి జారుకున్న స్టాక్‌మార్కెట్లు
స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 28 పాయింట్లు నష్టపోయి 36 వేల 645 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 3 పాయింట్లు కోల్పోయి 10 వేల 796 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో..
ఇండస్ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ, టాటాస్టీల్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, భారతీ ఎయిర్టెల్ రాణిస్తున్నాయి.
ఇన్ఫోసిస్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంకు, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఆసియా మార్కెట్లు
రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతుండడం... అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా అవి మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతుండగా, టోక్యో, సియోల్ మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. మరోవైపు వాల్‌స్ట్రీట్ నష్టాల్లో ముగిసింది.
ముడిచమురు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.16 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర43.01 డాలర్లుగా ఉంది.