ETV Bharat / business

లాభాల్లో ముగిసిన స్టాక్​ మార్కెట్లు.. 9,900పైకి నిఫ్టీ - నేటి స్టాక్​ మార్కెట్లు

stock market news
స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Jun 16, 2020, 9:45 AM IST

Updated : Jun 16, 2020, 3:59 PM IST

15:49 June 16

భయాలున్నా బుల్​ జోరు..  

ఒడుదొడుకులు ఎదురైనా మంగళవారం సెషన్​లో భారీ లాభాలు నమోదు చేశాయి స్టాక్ మార్కెట్లు. 370 పాయింట్ల లాభంతో 33,605 వద్దకు చేరింది సెన్సెక్స్​. నిఫ్టీ 100 పాయింట్ల వృద్ధితో 9,914 వద్ద స్థిరపడింది.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, హీరో మోటార్స్ షేర్లు ముఖ్యంగా లాభపడ్డాయి.

టెక్​ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఐటీసీ, భారతీ ఎయిర్​టెల్, పవర్​గ్రిడ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

14:46 June 16

తేరుకున్న సూచీలు

సెషన్ ముగింపునకు ముందు ఒడుదొడుకుల నుంచి తేరుకుని లాభాల్లో ట్రేడవుతున్నాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ దాదాపు 270 పాయింట్ల లాభంతో 33,500 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 70 పాయింట్లకుపైగా వృద్ధితో 9,886 వద్ద కొనసాగుతోంది.

హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటోకార్ప్, హెచ్​సీఎల్​ టెక్​లు లాభాల్లో ఉన్నాయి.

యాక్సిస్ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, టెక్​ మహీంద్రా, భారతీ ఎయిర్​టెల్, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

13:30 June 16

ఒడుదొడుకుల్లో సూచీలు..

అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 25 పాయింట్ల స్వల్ప లాభంతో 33,254 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 9,798 వద్ద ట్రేడవుతోంది.

భారత్​-చైనా మధ్య సరిహద్దుల వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలు ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మదుపరులు అమ్మకాలపై దృష్టి సారిస్తున్నారు.

ఇన్ఫోసిస్, హెచ్​డీఎఫ్​సీ, హీరో మోటోకార్ప్, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​సీఎల్ టెక్ లాభాల్లో ఉన్నాయి.  

యాక్సిస్ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్​బీఐ, ఐటీసీ, భారతీ ఎయిర్​టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

12:37 June 16

కాస్త వెనక్కి..

భారీ లాభాల నుంచి కాస్త వెనక్కి తగ్గాయి స్టాక్ మార్కెట్లు. మిడ్ సెషన్ తర్వాత సెన్సెక్స్ 330 పాయింట్లకుపైగా లాభంతో 33,560 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల వృద్ధితో 9,900 వద్ద కొనసాగుతోంది.

  • హెచ్​డీఎఫ్​సీ, ఇన్ఫోసిస్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, హీరో మోటోకార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, టెక్ మహీంద్రా, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎల్​&టీ, భారతీ ఎయిర్​టెల్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

10:44 June 16

రూపాయి 19 పైసలు వృద్ధి..

స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ దాాదాపు 650 పాయింట్ల వృద్ధితో 33,875 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 190 పాయింట్లకుపైగా లాభంతో 10,004 వద్ద కొనసాగుతోంది. 

  • టాటా స్టీల్, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • 30 షేర్ల ఇండెక్స్​లో యాక్సిస్​ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి.
  • కరెన్సీ మార్కెట్​లో రూపాయి 19 పైసలు పెరిగింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.75.84 వద్ద కొనసాగుతోంది.

09:59 June 16

అంతర్జాతీయ సానుకూలతలు..

అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న వ్యాపారాలకు 'ఫెడ్' ఉద్దీపన​ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. ఆ ప్రభావం దేశీయ సూచీలపైన పడింది. 

సెన్సెక్స్ దాదాపు 570 పాయింట్ల లాభంతో 33,797 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 160 పాయింట్లకుపైగా వృద్ధితో 9,977 వద్ద కొనసాగుతోంది.

ఆసియాలో ప్రధాన మార్కెట్లయిన.. షాంఘై, హాంకాంగ్, టోక్యో, కొరియా సూచీలు లాభాలతో సెషన్ ప్రారంభమయ్యాయి.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.53 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్​ ముడి చమురు ధర 33.51 డాలర్లకు తగ్గింది.

09:30 June 16

హెవీ వెయిట్ షేర్ల దన్ను

స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. కరోనా భయాలు ఉన్నా బుల్​ జోరు కొనసాగుతోంది. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్ల వృద్ధితో.. ప్రస్తుతం 33,922 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 200 పాయింట్లకుపైగా లాభంతో 10,000 వద్ద కొనసాగుతోంది.

  • బ్యాంకింగ్, హెవీ వెయిట్ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్ ఫినాన్స్, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • 30 షేర్ల ఇండెక్స్​లో అన్ని కంపెనీలు సానుకూలంగా స్పందిస్తున్నాయి.

Last Updated : Jun 16, 2020, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.