స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 95 పాయింట్లు పుంజుకుని.. 38,068 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది. స్వల్పంగా 25 పాయింట్లు పెరిగి 11,247 వద్ద సెషన్‌ను ముగించింది.
అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల నడుమ సూచీలు ఆద్యంతం ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఒకనొక దశలో భారీ లాభాలవైపూ దూసుకెళ్లాయి. ఎఫ్ఎంసీజీ షేర్లే ఎక్కువగా బుధవారం లాభాలను నమోదు చేశాయి. టెలికాం, లోహ షేర్లు నష్టపోయాయి.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 38,236 పాయింట్ల అత్యధిక స్థాయి, 37,828 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,305 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,181 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టెక్ మహీంద్రా, టైటాన్, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ రాణించాయి.
భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఎం&ఎం, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలతో ముగిశాయి.
ఆసియా మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు షాంఘై, టోక్యో సూచీలు బుధవారం నష్టాలను నమోదు చేశాయి. హాంకాంగ్ సూచీలు స్వల్పంగా లాభాలను గడించాయి.
రూపాయి, ముడి చమురు
కరెన్సీ మార్కెట్లో రూపాయి బుధవారం 10 పైసలు పెరిగింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ ప్రస్తుతం 73.76 వద్దకు చేరింది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.49 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 40.83 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:రిలయన్స్‌లో మరో సంస్థ భారీ పెట్టుబడి