అంతర్జాతీయ విమానాలు పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి చేరుకునే అవకాశం (Normal International flights resume) సమీప భవిష్యత్‌లో లేదని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia news) సంకేతాలిచ్చారు. సేవలను పూర్తిగా పునరుద్ధరించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రక్రియపై (normal international flights) సమాలోచనలు (normal international flight news) జరుపుతోందని చెప్పారు.
భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) దిల్లీలో నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న ఆయన.. విమాన ప్రయాణాలు పూర్తిగా ఎప్పుడు సాధారణ స్థితికి (international flight status) చేరతాయని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
"మేం ఈ ప్రక్రియను (normal international flights) పరిశీలిస్తున్నాం. పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావాలని అనుకుంటున్నాం. కానీ, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకోవాలి. రష్యా సహా ఐరోపాలోని పలు దేశాల్లో కరోనా నాలుగో వేవ్ కొనసాగుతోంది. వ్యాక్సిన్ పంపిణీ చేసిన దేశాల్లోనూ వైరస్ వ్యాపిస్తోంది. మనం ఎదుర్కొన్న పరిస్థితులను (దేశంలో రెండోవేవ్పై) అప్పుడే మర్చిపోవద్దు. విమాన సర్వీసులపై తుది నిర్ణయం తీసుకునే ముందు ఇతర మంత్రిత్వ శాఖలతో చర్చలు జరుపుతున్నాం."
-జ్యోతిరాదిత్య సింధియా, పౌరవిమానయాన శాఖ మంత్రి
భారత్‌ను ఏవియేషన్ హబ్‌గా మార్చాలని సంకల్పించుకున్నట్లు ఈ సందర్భంగా సింధియా పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని, ఇందుకోసం తమపై విశ్వాసం ఉంచాలని అన్నారు.
గతేడాది మార్చి నుంచి..
కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ప్యాసింజర్ విమాన సర్వీసులు గతేడాది మార్చిలో రద్దయ్యాయి. విదేశీ ప్రయాణాలను పునఃప్రారంభించే లక్ష్యంతో కేంద్రం 25 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం.. కొన్ని నిబంధనలు పాటించి.. ఇరుదేశాల విమానయాన సంస్థలు సర్వీసులను నడపాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: దేశీయ విమాన ప్రయాణాలపై కేంద్రం కీలక నిర్ణయం