మారటోరియం సమయంలో రుణాల వడ్డీపై వడ్డీకి సంబంధించిన పిటిషన్ల విచారణను ఈ నెల 5కు(గురువారం) వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
గురువారం(ననంబర్ 5) నాటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగ్యేతర సంస్థలు.. 2కోట్ల లోపు రుణాలు తీసుకున్న రుణ గ్రహీతల ఖాతాలో నగదును జమ చేస్తాయని రిజర్వు బ్యాంకు, ఆర్థికశాఖ ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానంలో అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేశాయి.
ఈ వ్యాజ్యాల విచారణ సోమవారం జరగాల్సి ఉంది. మంగళవారం విచారణకు వచ్చాయి. అయితే కేంద్రం తరఫున మరో కేసులో వాదిస్తుండటం వల్ల.. మారటోరియం పిటిషన్ల విచారణను వాయిదా వేయాలన్న తుషార్ మెహతా అభ్యర్థనను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎమ్ఆర్ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అంగీకరించింది.
ఇదీ చూడండి:- వడ్డీపై వడ్డీ మాఫీ.. ఎంత ఊరట?