ETV Bharat / business

'రైట్స్‌' చరిత్ర మారుస్తుందా! - reliance industries

రుణ రహిత కంపెనీగా మారాలనే లక్ష్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్​ రూ.53,125 కోట్ల రైట్స్‌ ఇష్యూను ప్రకటించింది. రికార్డు తేదీని ఈనెల 14గా నిర్ణయించింది. రిలయన్స్‌ షేర్లు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి 15 షేర్లకు కంపెనీ ఒక్కో షేరు చొప్పున కేటాయిస్తుంది. ఒక్కో షేరు ధరను రూ.1257గా నిర్ణయించింది.

reliance industries rights issue on may 14
రైట్స్‌ చరిత్ర మారుస్తుందా!
author img

By

Published : May 13, 2020, 9:33 AM IST

ఏ పనిచేసినా చరిత్ర సృష్టించడం అలవాటుగా మార్చుకున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌).. రైట్స్‌ ఇష్యూలోనూ అదే ఒరవడిని కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. అత్యధిక మార్కెట్‌ విలువ గల ప్రైవేటు కంపెనీగా, అతిపెద్ద టెలికాం కంపెనీగా, అతిపెద్ద రిఫైనరీ ఉన్న కంపెనీగా రిలయన్స్‌ చరిత్ర సృష్టిస్తోంది. రుణ రహిత కంపెనీగా మారాలనే లక్ష్యంతో రూ.53,125 కోట్ల రైట్స్‌ ఇష్యూను ప్రకటించిన ఆర్‌ఐఎల్‌, రికార్డు తేదీని ఈనెల 14గా నిర్ణయించింది. ఆ రోజున రిలయన్స్‌ షేర్లు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి 15 షేర్లకు ఒక్కో షేరు చొప్పున కంపెనీ కేటాయిస్తుంది. ఒక్కో షేరు ధరను రూ.1257గా నిర్ణయించింది. ఇది ఏప్రిల్‌ 30 నాటి ధరపై 14 శాతం రాయితీ. రూ.10 ముఖ విలువ గల మొత్తం 42,26,26,894 షేర్లను జారీ చేయనుంది. ఈ ఇష్యూకు దరఖాస్తు చేసేందుకు, మొత్తం విలువలో 25 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మిగతా ఒక ట్రెండు దఫాలుగా చెల్లించొచ్చు. ఇటీవలి రైట్స్‌ ఇష్యూల చరిత్రను ఇది తిరగరాయనుందని విశ్లేషకులు అంటున్నారు.

షేరు.. జోరు..

రికార్డు తేదీని ఖరారు చేశాక, సోమవారం బీఎస్‌ఈలో 3.4 శాతం లాభంతో రిలయన్స్‌ షేర్లు ఒక దశలో రూ.1615కు చేరుకున్నాయి. రికార్డు గరిష్ఠ స్థాయి అయిన రూ.1618కు చాలా దగ్గరే ఇది. 50 రోజుల కిందట అంటే మార్చి 23న 52 వారాల కనిష్ఠ స్థాయి అయిన రూ.876కు చేరడం గమనార్హం. ఆ తర్వాత 84 శాతం పుంజుకుంది. అయితే మంగళవారం మాత్రం ఆర్‌ఐఎల్‌ షేర్లలో లాభాల స్వీకరణ కనిపించింది. వరుస అయిదు రోజుల లాభాల(10%)కు గండి పడింది. బీఎస్‌ఈలో ఆర్‌ఐఎల్‌ స్క్రిప్‌ 6.12% నష్టంతో రూ.1480.25 వద్ద ముగిసింది. మార్కెట్‌ విలువ సైతం రూ.61,142 కోట్లు తగ్గి రూ.9.38 లక్షల కోట్లకు పరిమితమైంది.

ఇటీవలి ఇష్యూలకు..

టాటా గ్రూప్‌తో పాటు ఇటీవల వచ్చిన రైట్స్‌ ఇష్యూలకు వాటాదార్ల నుంచి 25-28 శాతం మేరే స్పందన వచ్చింది. ఆర్‌ఐఎల్‌ ఇష్యూకు భారీ స్పందన రావొచ్చన్నది విశ్లేషకుల అంచనా. 13 ఏళ్ల కిందట టాటా స్టీల్‌ రైట్స్‌ ఇష్యూకు 77% స్పందన లభించింది.

దరఖాస్తు చేయాలా? వద్దా?

రైట్స్‌ ఇష్యూలో తమకు కేటాయించిన మొత్తం షేర్లకు ప్రమోటర్లు దరఖాస్తు చేయనున్నారు. అదే సమయంలో స్పందన రాని షేర్లంన్నింటినీ కొనుగోలు చేయనున్నారు. కంపెనీపై ప్రమోటర్లకున్న ధీమాను ఇది తెలియజేస్తోందని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. రాబోయే కొద్ది త్రైమాసికాల్లో కంపెనీ రాణిస్తుందని.. ప్రస్తుత మార్కెట్‌ధర కంటే ఎక్కువగానే ఆర్‌ఐఎల్‌ షేరు లక్ష్యాన్ని చాలా వరకు బ్రోకరేజీలు పేర్కొంటున్నాయి. నొమురా, సెంట్రమ్‌, జేఎమ్‌ ఫైనాన్షియల్‌ వంటి బ్రోకరేజీ సంస్థలు రిలయన్స్‌ షేర్లను 'కొనుగోలు' చేయవచ్చని సిఫారసు చేస్తున్నాయి. రైట్స్‌ ఇష్యూకు దరఖాస్తు చేయడం మంచి పనే అవుతుందని అంటున్నాయి.

ఇదీ చూడండి: 'చైనా చేజారినా భారత్​కు దక్కడం డౌటే!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.