ETV Bharat / business

'ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథమే!' - ఆర్​బీఐ ఎంపీసీ

RBI MPC meeting: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​తో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ​రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) నిర్వహించనున్న ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సమావేశంలో కీలక వడ్డీరేట్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

RBI
ఆర్​బీఐ
author img

By

Published : Dec 5, 2021, 4:04 PM IST

Updated : Dec 5, 2021, 4:52 PM IST

RBI MPC meeting: రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సమావేశాన్ని సోమవారం నుంచి ప్రారంభించనుంది. ఈ సమావేశంలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఆర్​బీఐ కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఒమిక్రాన్​ భయాల నేపథ్యంలో వడ్డీరేట్లు కొనసాగించాల్సి అవసరం ఉంటుందని చెప్తున్నారు. దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడమే లక్ష్యంగా నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు. ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎమ్‌పీసీ) తీసుకునే నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ నెల 8వ తేదీన వెల్లడిస్తారు.

'మార్కెట్​లో గందరగోళం లేకుండా వడ్డీరేట్ల పెంపుదలను గతంలోలానే ఉంచుతుందని, మానిటరింగ్​ పాలసీ సమావేశానికి ముందే రివర్స్ రెపో రేటు పెంపుపై చర్చలు జరగవచ్చని'ఎస్​బీఐ రీసెర్చ్​ రిపోర్ట్​లో పేర్కొంది. అలాగే రివర్స్ రెపో రేటుపై నిర్ణయం అనేది సంక్షోభ సమయంలో మాత్రమే తీసుకునేది కాబట్టి దాని ప్రస్తావన ఇప్పుడు రాకపోవచ్చని పేర్కొంది.

కొత్త వేరియంట్​ అనిశ్చితి మధ్య కీలకమైన వడ్డీరేట్లపై నిర్ణయం ప్రకటించేందుకు ఆర్​బీఐ మరికొంత సమయం తీసుకోవచ్చని కోటక్ ఎకనామిక్ రీసెర్చ్ తెలిపింది.

TAGS: RBI MPC meeting, rbi monetary policy 2021, rbi policy rates

ఇదీ చూడండి: కొత్త సంవత్సరంలో కార్ల ధరలకు రెక్కలు!

Last Updated : Dec 5, 2021, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.