ETV Bharat / business

కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచనున్న ఆర్బీఐ! - rbi interest rates news

రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలకన్నా ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ద్రవ్య పరపతి విధాన సమీక్షలోనూ వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచ్చొచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్​బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష డిసెంబరు 2న ప్రారంభమవుతోంది. 4న సమీక్ష నిర్ణయాలు వెల్లడికానున్నాయి.

RBI likely to keep interest rates unchanged this week, say experts
కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచనున్న ఆర్బీఐ!
author img

By

Published : Dec 2, 2020, 5:32 AM IST

కీలక వడ్డీ రేట్లను ఆర్​బీఐ మరోసారి యథాతథంగా ఉంచే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్​బీఐ, ఆర్థిక శాఖ లక్ష్యంగా పెట్టుకున్న స్థాయికన్నా.. వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న కారణంగా బుధవారం నుంచి జరగనున్న ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షలో ఈ నిర్ణయం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. విశ్లేషకుల అంచనా ప్రకారం.. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకుంటే.. ఇవి యథాతథంగా ఉండటం వరసగా మూడోసారి అవుతుంది.

అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనూ భారత వృద్ధి రేటు ప్రతికూలంగానే నమోదైంది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల కోతకు అవకాశాలు లేకపోలేదని అంటున్నారు నిపుణులు.

ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్య విధాన కమిటీ.. ఆర్​బీఐ గవర్నర్ నేతృత్వంలో డిసెంబర్ 2 నుంచి సమీక్ష నిర్వహించనుంది. మూడు రోజుల సమావేశం అనంతరం డిసెంబర్ 4న రెపో రేటు సహా.. ఇతర కీలక నిర్ణయాలను ప్రకటించనుంది ఆర్​బీఐ.

గత​ సమీక్ష నిర్ణయాలు ఇలా..

ద్రవ్యోల్బణం 6 శాతానికిపైగా నమోదైన కారణంగా.. రెపో రేటు, రివర్స్​ రెపో రేట్లను వరుసగా 4 శాతం, 3.35 శాతం వద్ద యథాతథంగా ఉంచుతూ ఆర్​బీఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ -9.5 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది.

కరోనా కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 115 బేసిస్​ పాయింట్ల రెపో కోత విధించిన విషయం తెలిసిందే.

విశ్లేషణలు..

"కొన్ని నెలలుగా వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం ఆర్​బీఐ లక్ష్యంగా పెట్టుకున్న 4 శాతం కన్నా అధికంగా ఉంటూ వస్తోంది. ఈ కారణంగా వడ్డీ రేట్ల కోతకు పెద్దగా అవకాశం లేదు. అయితే ఆర్థిక వ్యవస్థ ఇటీవల వేగంగా పుంజుకుంటున్నట్లు, పండుగ సీజన్​తో వినియోగదారు డిమాండ్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న నెలలు చాలా కీలకం. డిమాండ్ కొనసాగుతుందా లేదా అనే విషయంతో పాటు వృద్ధి రేటు, ఇతర ఆర్థిక గణాంకాలను ఆర్​బీఐ నిశింతంగా పరిశీలించే అవకాశముంది."

-శాంతి ఏకాంబరం, కోటక్ మహీంద్రా బ్యాంక్ గ్రూప్ కన్స్యూమర్ బ్యాంకింగ్ అధ్యక్షురాలు

ఇదీ చూడండి: 'వృద్ధి అంచనాలు సానుకూలమే.. కానీ...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.