ETV Bharat / business

'ప్రభుత్వ ప్రకటన తర్వాతే బుకింగ్స్​ ప్రారంభించండి' - corona latest news

విమాన ప్రయాణాలకు సంబంధించి బుకింగ్స్​ ఇప్పుడే ప్రారంభించవద్దని విమానయాన సంస్థలకు సూచించింది కేంద్రం. ఈ మేరకు స్పష్టం చేశారు కేంద్ర విమానయాన మంత్రి హర్​దీప్​సింగ్​ పూరి. ప్రభుత్వం ప్రకటించేవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని పేర్కొన్నారు.

Open bookings only after govt decides on starting flight services
'ప్రభుత్వ ప్రకటన తర్వాతే బుకింగ్స్​ ప్రారంభించండి'
author img

By

Published : Apr 19, 2020, 8:00 AM IST

ప్రభుత్వం ప్రకటన చేసే వరకు.. విమాన ప్రయాణాలకు సంబంధించి బుకింగ్స్​ ప్రారంభించవద్దని విమానయాన సంస్థలకు సూచించారు కేంద్ర మంత్రి హర్​దీప్​సింగ్​ పూరి. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

Open bookings only after govt decides on starting flight services
కేంద్ర మంత్రి ట్వీట్​

''పౌర విమానయాన మంత్రిత్వ శాఖ... దేశీయ, అంతర్జాతీయ విమాన సేవల పునరుద్ధరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.''

- ట్విట్టర్​లో కేంద్ర విమానయాన మంత్రి హర్​దీప్​సింగ్​ పూరి.

లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత మే 4 నుంచి దేశీయ ప్రయాణాలకు, జూన్​ 1 నుంచి అంతర్జాతీయ సర్వీసులకు (ఎంపిక చేసిన రూట్లలో) బుకింగ్స్​ ప్రారంభిచనున్నట్లు ఎయిర్​ ఇండియా తెలిపిన కొద్దిగంటల్లోనే కేంద్రమంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం.

5 రోజుల క్రితం ఇండిగో కూడా మే 4 నుంచి దశలవారీగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు పేర్కొంది.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్ కొనసాగుతోంది. మే 3వరకు ఇదే పరిస్థితి ఉండనుంది. ఈ కారణంగా అన్ని రకాల ప్యాసింజర్ విమానాలు నేలకే పరిమితమయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.