ETV Bharat / business

'చిరు, వీధి వ్యాపారులకు సులువుగా రుణాలు' - భారీ ప్యాకేజీ రెండో రోజు

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులపై వరాల జల్లు కురిపించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. లాక్​డౌన్ సడలించిన తర్వాత వ్యాపారాలు వెంటనే పునఃప్రారంభించడానికి వీధి వ్యాపారులకు రూ.5,000 కోట్ల రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

nirmala
నిర్మలా
author img

By

Published : May 14, 2020, 5:10 PM IST

ఆత్మనిర్భర భారత్​ అభియాన్​లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను రెండో రోజూ విశదీకరించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇందులో భాగంగా రైతులు, వలస కార్మికులు, వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులపై ప్రధానంగా దృష్టి సారించారు.

ముద్ర శిశు రుణాలు

ముద్రా ముద్రా యోజన కింద శిశు రుణాలు తీసుకున్నవారికి వడ్డీ రేట్లలో సబ్సిడీ ఇస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 3 నెలల మారటోరియం తర్వాత 12 నెలల పాటు 2శాతం ఇంట్రెస్ట్ సబ్​వెన్షన్(వడ్డీరేట్లలో సబ్సిడీ) సౌలభ్యం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.​ దీని ద్వారా 3 కోట్ల మందికిపైగా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఈ సబ్సిడీ ద్వారా రూ.1500 కోట్లు లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు.

వీధి వ్యాపారులు

కరోనా కారణంగా వీధి వ్యాపారులే తీవ్రంగా దెబ్బతిన్నారని నిర్మలా పేర్కొన్నారు. పూర్తి లాక్​డౌన్ విధించడం వల్ల ఎలాంటి వ్యాపారం నిర్వహించే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ తర్వాత వెంటనే వ్యాపారాలు ప్రారంభించే విధంగా రూ.5 వేల కోట్ల రుణ సదుపాయం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.

దీని ద్వారా వివిధ రాష్ట్రాల్లోని 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుందని నిర్మల పేర్కొన్నారు. వ్యాపారులకు రూ.10 వేల పెట్టుబడి సాయం అందించనున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.