భారత మార్కెట్లోకి వన్ ఫ్యూజన్ ప్లస్ పేరుతో సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది మోటోరోలా. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో ఈ ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది. విడుదలకు ముందే మోటోరోలా అధికారికంగా లీక్ చేసిన ఫీచర్లతో ఈ మోడల్ ధర భారీగా ఉండొచ్చని అందరూ అనుకున్నారు. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ ఈ మోడల్ ధరను రూ.16,999గా నిర్ణయించింది కంపెనీ.
జూన్ 24 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్ఫోన్ ఫ్లిప్కార్ట్లో కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.
ఫ్యూజన్ ప్లస్ ఫీచర్లు..
- 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
- క్వాల్కమ్ 730 జీ ప్రాసెసర్
- వెనుకవైపు నాలుగు కెమెరాలు (64 ఎంపీ+8ఎంపీ+8ఎంపీ+2ఎంపీ)
- 16 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
- ఆండ్రాయిడ్ 10 ఓఎస్