ETV Bharat / business

లాక్‌డౌన్‌లో రోజుకు 4 గంటలు ఆన్‌లైలోనే! - కరోనా వార్తలు తెలుగు

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఆన్‌లైన్ మీడియా వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా కరోనా సంబంధి వార్తలు, ఎంటర్‌టైన్మెంట్ కంటెంట్‌ను అధికంగా వినియోగిస్తున్నట్లు ఓ సర్వే ద్వారా తెలిసింది.

lock down media
లాక్‌డౌన్‌లో మీడియా వినియోగం
author img

By

Published : Apr 22, 2020, 12:14 PM IST

దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఇంటర్నెట్ అధికంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా సమాచారం, ఎంటర్‌టైన్మెంట్ కంటెంట్ వినియోగం భారీగా పెరిగినట్లు మైండ్‌షేర్ సౌత్‌ ఏషియా, వీడూలీ అనే సంస్థలు చేసిన సర్వేలో వెల్లడైంది.

సర్వేలోని ముఖ్యంశాలు..

  • లాక్‌డౌన్‌ తర్వాత సామాజిక మాధ్యమాల్లో సగటు యూజర్‌ గడిపే సమయం 4 గంటలకు పెరిగింది. లాక్‌డౌన్‌కు ముందు ఇది 1.5 గంటలుగా ఉండేది.
  • మొబైల్ డేటా వినియోగంలో 30 శాతం వృద్ధి నమోదైంది.
  • లాక్‌డౌన్‌తో అత్యధికంగా లబ్ధిపొందిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌.
  • ఈ ఏడాది తొలి మూడు నెలల్లో యూట్యూబ్‌ వీక్షణలు 300 బిలియన్లు దాటాయి. ఇది 2019 చివరి త్రైమాసికం కన్నా 13 శాతం, తొలి త్రైమాసికం కంటే 11 శాతం అధికం.
  • యూట్యూబ్‌ వినియోగదారుల్లో యువతే అధికం. 70 శాతం యూట్యూబ్‌ వీక్షణలు 18 నుంచి 34 ఏళ్ల వయసున్న వాళ్లవే.
  • యూట్యూబ్ సబ్‌స్కైబర్లలో 20.5 శాతం వృద్ధి నమోదైంది.
  • వినోదం, మ్యూజిక్‌, న్యూస్ కంటెంట్ వినియోగంలో 70 శాతం, యూట్యూబ్ వీక్షణల్లో 90 శాతం మొబైళ్ల ద్వారానే వస్తున్నాయి.
  • విద్యా విభాగంలో ఆన్​లైన్​ కంటెంట్ వినియోగం 120 శాతం పెరిగింది.
  • ఫుడ్, గేమింగ్‌, సమాచార విభాగాల్లో వీక్షణలు వరుసగా 52 శాతం, 23 శాతం, 42 శాతం పెరిగాయి.

ఇదీ చూడండి:వాట్సాప్​లో ఒకేసారి 8 మందితో వీడియో​ కాల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.