ETV Bharat / business

వాట్సాప్​లో ఒకేసారి 8 మందితో వీడియో​ కాల్​

author img

By

Published : Apr 22, 2020, 10:37 AM IST

కరోనా వైరస్​ వ్యాప్తి కారణంగా కోట్లాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీని వల్ల ఇంట్లో ఖాళీ ఉండ లేక సామాజిక మాధ్యమాల్లోనే అధిక సమయం గడుపుతున్నారు. ఇలాంటి వారి కోసం వాట్సాప్​ కొత్త ఫీచర్​ అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటి వరకు పరిమితంగా ఉన్న వీడియో, ఆడియో కాల్​ల పరిధిని పెంచనుంది.

WhatsApp to soon allow 8 users in group video, audio calls
వాట్సాప్​ బంపర్ ఆఫర్​: ఒకేసారి 8 మందితో వీడియో, ఆడియో​ కాల్​

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున చాలా దేశాల్లో లాక్​డౌన్ విధించారు. ఈ కారణంగా కోట్లాది మంది ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా ఇళ్లలో ఉంటున్నవారు తమకు ఇష్టమైన వారితో మాట్లాడేందుకు గ్రూప్​ వీడియో కాల్స్​ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే పరిమిత స్థాయిలో ఉన్న ఈ అవకాశాన్ని వాట్సాప్​ ఆప్​డేట్​ చేయనుంది. ఇకపై వాట్సాప్​ వేదికగా ఒకేసారి 8 మందితో వీడియో, ఆడియో కాల్​ మాట్లాడే అవకాశాన్ని కల్పించనుంది.

అప్​డేట్​ చేయనుందిలా

ఇప్పటివరకు వాట్సాప్​ ద్వారా నలుగురు మాత్రమే వీడియో కాల్ మాట్లాడేవారు. ఇప్పుడు ఆ పరిధిని ఎనిమిదికి పెంచనుందీ సంస్థ. అయితే ఇందుకోసం టెస్ట్​ఫ్లైట్​ నుంచి 2.20.50.25 ఐఓఎస్​ బీటా అప్​డేట్​ను పొందవచ్చు. లేదంటే గూగుల్​ ప్లే స్టోర్​ నుంచి 2.20.133 బీటాను పొందాలి.

రెట్టింపైన వినియోగం

లాక్​డౌన్ నుంచి వీడియో కాల్స్ వినియోగం పెరిగింది. ఫేస్​బుక్​ మెసెంజర్​ ద్వారా గ్రూప్​ వీడియో కాల్స్​ను 70 శాతం కంటే ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అదే విధంగా వాట్సాప్​ వాయిస్​, వీడియో కాల్స్ వాడకం రెట్టింపు స్థాయిలో పెరిగింది.

ఫేస్​టైమ్​ వీడియో కాలింగ్​ ద్వారా ఒకేసారి 32 మందికి అవకాశం ఉండగా ఫేస్​బుక్​ మెసెంజర్​లో 50 మంది మాట్లాడొచ్చు.

ఇదీ చదవండి: ఫేస్​బుక్​ నుంచి త్వరలో ఉచిత గేమింగ్​ యాప్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.