ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాధీనంలోని పలు సంస్థలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. మరిన్ని సంస్థలు విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఆయా సంస్థల్లో ఖాళీలు ఎన్ని? దరఖాస్తు గడువు ఎప్పటి వరకు? అనే వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో..
తెలంగాణ పోలీస్ 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రారంభ తేదీ, చివరి తేదీ తదితర పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
మిథానీ, హైదరాబాద్
- పోస్టులు- వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఇన్స్ట్రుమెంటేషన్
- పోస్టుల సంఖ్య - 10
- అర్హత - ఎస్ఎస్సీ, ఐటీఐ, న్యాక్(సంబంధింత సబ్జెక్టులు)
- చివరి తేదీ - ఆగస్టు 02, ఆగస్టు 03(వాక్ ఇన్)
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హైదరాబాద్
- పోస్టులు - ప్రాజెక్టు ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్
- పోస్టుల సంఖ్య - 49
- అర్హత - బీఈ, బీటెక్, బీఎస్(ఇంజనీరింగ్), ఎంబీఏ తదితరాలు
- చివరి తేదీ - 2021 అగస్టు 04
ఆంధ్రప్రదేశ్‌లో..
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో ల్యాబ్ టెక్నిషీయన్ల(క్యారీ ఫార్వర్డ్) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుకు చివరి తేదీ 2021 ఆగస్టు 01.
మెడికల్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి డీఎంహెచ్ఓ అనంతరపురం నోటిఫికేషన్ విడుదల చేశారు. తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ 2021 జులై 26.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జూనియర్ సివిల్ జడ్జీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 08వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటీవ్ బ్యాంక్ లిమిటెడ్
- పోస్టులు- మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్
- పోస్టుల సంఖ్య - 61
- అర్హత - ఏదైనా డిగ్రీ
- చివరి తేదీ - 2021 ఆగస్టు 05
గమనిక: ఇవి సమాచారం కోసం మాత్రమే. పూర్తి వివరాల కోసం సంబంధిత సంస్థ వైబ్సైట్లను పరిశీలించగలరు.
ఇదీ చదవండి:ఫ్రెషర్స్‌కు శుభవార్త.. 20వేల ఉద్యోగాలకు రంగం సిద్ధం!