ETV Bharat / business

జియో-గూగుల్​ కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు ఇవేనా? - జియో కొత్త ఫోన్​

జియో, గూగుల్‌ కలసి తక్కువ ధరలో.. మంచి ఫీచర్లతో స్మార్టఫోన్‌ను తీసుకొస్తామని కొన్ని నెలల క్రితం ప్రకటించాయి. అయితే.. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఇవే అంటూ ఆన్​లైన్​లో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అవేంటంటే..?

jio phone next
జియో ఫోన్​ నెక్స్ట్​
author img

By

Published : Aug 15, 2021, 10:26 PM IST

తక్కువ ధరలో.. మంచి ఫీచర్లతో స్మార్టఫోన్‌ను తీసుకొస్తామని జియో కొన్ని నెలల క్రితం ప్రకటించింది. ఇటీవల జరిగిన 44వ రిలయన్స్‌ ఏజీఎంలో ఈ మొబైల్‌ను అధికారికంగా ప్రకటించారు. జియో, గూగుల్‌ కలసి ఈ మొబైల్‌ను రూపొందిస్తున్నాయి. వచ్చే నెలలో ఈ మొబైల్‌ లాంచ్‌ ఉండొచ్చు. అయితే ఈ మొబైల్‌ స్పెసిఫికేషన్లు ఇవే అంటూ కొన్ని ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అవేంటి, మొబైల్‌ ఎలా ఉండబోతోందో చూద్దాం!

బూటింగ్‌ స్క్రీన్‌తోనే ఈ మొబైల్‌ ప్రత్యేకత కనిపిస్తుంది. JioPhone Next created with Google అని బూట్‌ స్క్రీన్‌లో వస్తుందని తెలుస్తోంది. ఇక మిగిలిన వివరాలు చూస్తే... LS-5701-J కోడ్‌ నేమ్‌తో ఈ మొబైల్‌ రూపొందుతోంది. ఆండ్రాయిడ్‌ 11 (గో ఎడిషన్‌)తో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేస్తారని సమాచారం. ఇందులో 720X1440 పిక్సల్స్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఉంటుంది. వెనుకవైపు ఒక కెమెరా ఉంటుంది.

కొత్త తరం గూగుల్​ 'కెమెరా గో'

క్వాల్‌కోమ్‌ క్యూఎం215 ప్రాసెసర్‌ ఉంటుంది. అడ్రినో 308 జీపీయూ ఉండొచ్చు. స్నాప్‌డ్రాగన్‌ ఎక్స్‌5 ఎల్‌టీఈ మోడమ్‌ వాడుతున్నారు. బ్లూటూత్‌ వెర్షన్‌ 4.2 ఉంటుంది. ఎల్‌పీడీడీఆర్‌3 ర్యామ్‌ ఉంటుంది. ఇందులో కొత్త తరం గూగుల్‌ 'కెమెరా గో' ఉంటుంది. ఇందులో ప్రత్యేకగా స్నాప్‌చాట్‌ను ఇంటిగ్రేట్‌ చేస్తున్నారు. వెనుకవైపు 13 ఎంపీ కెమెరా ఉంటుంది. ముందువైపు సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఇస్తున్నారు.

ధర ఎంత ఉండొచ్చంటే..?

వీడియో కాల్స్‌ కోసం 'డుయో గో' యాప్‌ ఉంటుంది. ఇది తక్కువ ర్యామ్‌ను వినియోగించుకుంటుందని చెబుతున్నారు. అంతర్జాతీయ ధర ప్రకారం చూస్తే.. 50 డాలర్ల వరకు పెడతారని అంటున్నారు. అంటే మన మార్కెట్‌లో సుమారు ₹4,000కే అందుబాటులోకి రావొచ్చు. ముందుగా చెప్పిన సమాచారం ప్రకారం అయితే సెప్టెంబరు 10న ఈ మొబైల్‌ను అధికారికంగా లాంచ్‌ చేస్తారు.

ఇదీ చూడండి: ఈఎమ్​ఐల మోత ఎక్కువైందా? రుణ భారం తగ్గించుకోండిలా...

ఇదీ చూడండి: విద్యుత్ వాహనాలే కాదు.. ఇవీ పర్యావరణ హితమే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.