ETV Bharat / business

Jio 1 rs plan: జియో సూపర్ ఆఫర్- ఒక్క రూపాయికే డేటా ప్యాక్ - టెలికాం దిగ్గజం రిలయన్స్ గురించి చెప్పండి?

Jio 1 rs plan: మార్కెట్లోని మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్న టెలికాం దిగ్గజం మరో ఆఫర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.1కే ప్రీపెయిడ్ ప్లాన్‌ను తెచ్చింది. దీనితో 100ఎంబీ డేటాను పొందొచ్చు. అవసరమైన మేరకే డేటాను కొనుగోలు చేసే వీలున్న ఈ ప్లాన్​ గురించి జియో అధికారికంగా ప్రకటించలేదు. కానీ.. యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకునే వీలు కల్పించింది.

Reliance Jio
జియో
author img

By

Published : Dec 15, 2021, 4:25 PM IST

Jio 1 rs plan: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో మరో అదిరిపోయే ప్రీపెయిడ్ ఆఫర్​ను ప్రవేశపెట్టింది. రూ.1కే ప్రత్యేక ప్లాన్‌ను అందిస్తోంది. ఇది ఓ డేటా ఓచర్. దీనితో వినియోగదారులకు 30 రోజుల వ్యాలిడిటీతో 100ఎంబీ డేటాను అందిస్తోంది జియో. దీనితో రూ.1కే ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందించే మొట్టమొదటి ఆపరేటర్‌గా అవతరించింది జియో. ఈ ఓచర్‌తో రూ.10 వెచ్చించి పదిసార్లు రీఛార్జ్ చేసుకోవచ్చు. దీనితో 30 రోజుల పాటు 1జీబీ డేటా లభిస్తుంది.

Jio New Plans Postpaid: అవసరమైన మేరకే డేటా కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగపడనుంది. అయితే.. మొబైల్ యాప్‌లో మాత్రమే కనిపిస్తున్న ఈ ప్లాన్.. ఇతర వెబ్‌సైట్‌లలో కనిపించపోవడం గమనార్హం.

Reliance Jio
మొబైల్​ యాప్​లో 100ఎంబీ డేటా వోచర్​

Jio Latest Plans: ఈ ప్లాన్ కింద అందించే 100ఎంబీ డేటా కాలపరిమితి 30 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు రీఛార్జ్ చేసుకోవచ్చు. డేటా అవసరం ఎక్కువగా లేనప్పుడు 4జీ ఓచర్‌లను కొనుగోలు చేయడం కంటే ఇది మేలు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.