ETV Bharat / business

ఆదాయ పన్ను రిటర్ను దాఖలుకు కావాల్సిన కీలక పత్రాలివే! - ఆదాయ పన్ను రిటర్ను

ITR Filing: 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపన్ను రిటర్ను(ఐటీఆర్​) దాఖలు చేయాల్సిన గడువు సమీపిస్తోంది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా గడువుకన్నా ముందే రిటర్ను దాఖలు చేయడం మంచిది. అయితే ఐటీఆర్ ఫైల్​ చేయడానికి తొమ్మిది పత్రాలు కీలకం అవేంటంటే..?

ITR Filing 2020-21
ITR Filing 2020-21
author img

By

Published : Dec 23, 2021, 7:13 PM IST

ITR Filing: 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటీఆర్)​ దాఖలు చేయడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. సాధారణంగా ఐటీఆర్‌లను దాఖలు చేయడానికి ఏటా జులై 31 వరకే గడువు ఇస్తుంది ఆదాయ పన్నుశాఖ. అయితే కొత్త ఐటీఆర్​ పోర్టల్​లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ఈ ఏడాది రెండుసార్లు గడువు పొడిగించింది. ఆ గడువు ఈ నెల 31తో ముగియనుంది.

ఏదేమైనా.. ఐటీఆర్​ ఫైల్​ చేసే సమయంలో మీ ఆదాయం గురించి కచ్చితమైన, సరైన సమాచారం అందించడం ఎంతో కీలకం. లేకుంటే ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఐటీఆర్​ను దాఖలు చేసేటప్పుడు తొమ్మిది కీలక ధ్రువపత్రాలు మీ వెంట ఉంచుకోవాలి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.

1. ఫారం-16

ఉద్యోగుల వేతనం నుంచి ప్రతినెల యాజమాన్యం విధిస్తున్న కోతకు సంబంధించిన ధ్రువపత్రమే ఈ 'ఫారం-16'. ఇందులో ఆదాయ పన్ను శాఖకు సంస్థ యాజమాన్యం చెల్లిస్తున్న పన్ను వివరాలు ఉంటాయి. అందుకే ఆదాయ పన్ను రిటర్ను సమయంలో 'ఫారం-16' చాలా ముఖ్యం. ఈ ఫారంలో పార్ట్​-ఏ, పార్ట్​-బీ ఉంటాయి.

పార్ట్-ఏలో.. ఏడాదిలో మీ వేతనం నుంచి యజమాన్యం విధిస్తున్న కోతకు సంబంధించిన వివరాలతో పాటు మీ పాన్​ నంబరు ఉంటుంది. ఇందులోనే యాజమాని పాన్​, ట్యాక్స్​ డిడక్షన్​ అకౌంట్​ నంబరు(టాన్​) కూడా ఉంటాయి.

పార్ట్​-బీలో.. మీ వేతన చెల్లింపు వివరాలు ఉంటాయి. అయితే పన్ను చెల్లింపుదారులు పాన్​​ నంబరు సరిగ్గా ఉందోలేదో చూసుకోవాలి. అందులో ఏదైనా తప్పులుంటే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి. దానిని సవరించి కొత్తగా ఫారంను జారీ చేస్తారు.

2. వడ్డీ ధ్రువపత్రం

ఐటీఆర్​ దాఖలు చేసే సమయంలో సేవింగ్​ అకౌంట్​, ఫిక్స్‌డ్​ డిపాజిట్లు, రికరింగ్​ డిపాజిట్లు, పోస్టాఫీసు స్కీమ్‌లు తదితర వనరుల నుంచి పొందిన వడ్డీ ఆదాయానికి సంబంధించిన వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏడాదిలో వడ్డీ రూపంలో వచ్చిన ఆదాయానికి సంబంధించిన వివరాలతో బ్యాంకులు, పోస్టా​ఫీసుల నుంచి వడ్డీ ధ్రువపత్రం పొందడం ఎంతో కీలకం. అలాగే మీ బ్యాంకింగ్ లావాదేవీల రికార్డు కూడా ఉంచుకోవాలి.

బ్యాంకులు.. వడ్డీ ఆదాయంపై ఏదైనా ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్​) ద్వారా కోత విధించినట్లయితే.. తప్పనిసరిగా బ్యాంకు లేదా పోస్టాఫీసు నుంచి ఫారం-16ఏ/టీడీఎస్​ సర్టిఫికేట్‌లను సేకరించాలి.

3. ఇతరుల నుంచి టీడీఎస్​ సర్టిఫికేట్స్​

బ్యాంకులు, పోస్టాఫీసులు కాకుండా.. మీకు చేసిన చెల్లింపులపై పన్ను మినహాయించిన ఇతరుల నుంచి కూడా టీడీఎస్​ సర్టిఫికేట్‌లను సేకరించాలి. ఉదాహరణకు మీరు అద్దె ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని అనుకుందాం. మీ అద్దెదారు మీకు చెల్లించిన రెంట్​పై టీడీఎస్​ని మినహాయించినట్లయితే.. వారి నుంచి టీడీఎస్​ డిడక్షన్ చూపిస్తూ ఫారం-16సీని సేకరించాలి. ఆదాయ పన్ను చట్టం ప్రకారం నెలవారీ అద్దె రూ.50,000 కంటే ఎక్కువ ఉంటే.. అద్దె మొత్తం నుంచి టీడీఎస్​ డిడక్ట్​ చేస్తారు.

అలాగే మీరు మునుపటి ఆర్థిక సంవత్సరంలో ఆస్తిని విక్రయించి ఉంటే.. కొనుగోలుదారు మీకు చేసిన చెల్లింపుపై టీడీఎస్​ మినహాయించినట్లయితే.. వారి నుంచి ఫారం-16బీని పొందాలి.

4. ఫారం-26ఏఎస్​

ఫారం-26ఏఎస్​ను మీ ఏకీకృత వార్షిక పన్ను స్టేట్​మెంట్​గా కూడా పిలుస్తారు. మీ బ్యాంకు పాస్‌బుక్​ లాగానే.. మీ పాన్‌ నంబరు ద్వారా చెల్లించిన పన్నుకు సంబంధించిన మొత్తం సమాచారం ఇందులో ఉంటుంది. యాజమాన్యం విధించిన టీడీఎస్​ సహా... బ్యాంకులు, ఇతర సంస్థలు, మీకు చెల్లింపులు చేసిన టీడీఎస్​ డిడక్షన్లు, ఆర్థిక సంవత్సరంలో అంతకుముందు చెల్లించిన పన్ను వివరాలు ఉంటాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో డిడక్ట్​ అయిన అన్ని పన్నులు వివరాలు ఫారం-26ఏఎస్​లో ఉంటాయని పన్ను చెల్లింపుదారులు గుర్తించుకోవాలి.

5. పన్ను ఆదా పెట్టుబడి, ఖర్చుకు రుజువులు

మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే.. పన్ను ఆదా చేసే సాధనాల్లో మీ పెట్టుబడులకు రుజువులను(ప్రూఫులు) ఉంచుకోవాలి. తద్వారా ఆ పెట్టుబడులపై మినహాయింపును పొందవచ్చు. అలాగే బ్యాంకు నుంచి ఏదైనా హోమ్​ లోన్​​ తీసుకున్నట్లయితే దానిపై చెల్లించిన వడ్డీ మొత్తం వివరాలను పేర్కొంటూ బ్యాంకుల నుంచి వడ్డీ ధ్రువీకరణ పత్రాన్ని సేకరించాలి.

6. మూలధన లాభాలు

షేర్లు, మ్యూచువల్ ఫండ్స్​, ఆస్తి, భూమి వంటి మూలధన ఆస్తులను విక్రయించడం ద్వారా ఆర్జించిన ఆదాయాన్ని ఐటీఆర్‌లో వెల్లడించాలి. మ్యూచువల్ ఫండ్స్​, ఈక్విటీ షేర్ల నుంచి మూలధన లాభాల విషయంలో బ్రోకర్​, వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్​(ఏఎంసీ) నుంచి క్యాపిటల్ గెయిన్స్ స్టేట్‌మెంట్‌ను సేకరించి.. లావాదేవీల తేదీలు, ధర, స్వల్పకాలిక, దీర్ఘకాలిక లాభనష్టాల వివరాలను పేర్కొనాలి.

ఆస్తిని విక్రయించినట్లయితే.. ఆ ఆస్తి కొనుగోలు దస్తావేజు, అమ్మకపు దస్తావేజు, కొనుగోలుదారు పేరు, పాన్, చిరునామా తదితర వివరాలు అవసరం. అలాగే బిట్‌కాయిన్‌లను విక్రయించి లాభాలు పొందినట్లయితే.. అటువంటి లావాదేవీలను కూడా ఐటీఆర్‌లో నివేదించాలి.

7. అన్​లిస్టెడ్​ షేర్లలో పెట్టుబడి వివరాలు

మీ వద్ద అన్‌లిస్టెడ్​ షేర్‌లు ఉన్నట్లయితే వాటిని కూడా ఐటీఆర్​లో వెల్లడించాల్సి ఉంటుంది. జీతం, బ్యాంకు ఖాతాలో వడ్డీ ద్వారా పొందిన ఆదాయమైతే.. ఐటీఆర్​-2 ఫారంను ఉపయోగించాలి. ఐటీఆర్​-2 ఫారంలో మీరు అన్​లిస్టెడ్​ షేర్‌లకు సంబంధించి కొన్ని వివరాలను పేర్కొనాలి. అవి..

  • కంపెనీ పేరు
  • కంపెనీ పాన్​ నంబరు
  • 2020 ఏప్రిల్​ 1 నాటికి ప్రారంభ బ్యాలెన్స్, కొనుగోలు ఖర్చు
  • కొనుగోలు చేసిన తేదీ, షేర్ల ముఖ విలువ, ఒక్కో షేరుకు ఇష్యూ ధరతో సంవత్సరంలో పొందిన అన్​లిస్టెడ్​ షేర్ల వివరాలు
  • ఏడాదిలో విక్రయించిన అన్​లిస్టెడ్​ షేర్లు, పొందిన మొత్తం
  • 2021 మార్చి 31 నాటికి ముగింపు బ్యాలెన్స్, కొనుగోలు ఖర్చు.

8. బ్యాంకు ఖాతా వివరాలు

మీ బ్యాంకు ఖాతాల వివరాలను తప్పనిసరిగా సమర్పించాలి. ఒకవేళ మీ ఖాతాను మూసివేసినప్పటికీ.. దానిని గురించి ఐటీఆర్​లో నివేదించాల్సి ఉంటుందని పన్ను నిపుణులు అంటున్నారు. మీ బ్యాంకు పేరు, ఖాతా నంబరు, ఖాతా రకం, ఐఎఫ్​ఎస్​సీ కోడ్‌ను పేర్కొనాల్సి ఉంటుంది.

9. ఆధార్ సంఖ్య

ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులు తమ ఆధార్ నంబరును కోట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబరు లేకపోతే.. దాని కోసం దరఖాస్తు చేసినట్లయితే.. ఆ ఐడీని ఐటీఆర్​ ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:

ITR Filing: ఆదాయపు పన్ను.. ఏ ఫారం.. ఎవరి కోసం?

'ఫారం-16'లో కీలక మార్పులు ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.