ETV Bharat / business

ఈటీఎఫ్‌లో మదుపు.. రిస్క్‌ తక్కువ.. రిటర్న్స్‌ ఎక్కువ! - debt etf

సంపన్నులతో పాటు రిటైల్‌ మదుపర్లు కూడా ఎక్స్‌ఛేంజ్‌ ట్రేడేడ్‌ ఫండ్స్‌(ఈటీఎఫ్‌)లో పెట్టుబడి పెట్టడంపై ఆసక్తి చూపిస్తున్నారు. గత ఏడాది కాలంలో ఈ రంగంలో రిటైల్‌ఫోలియోలు రెండింతలై 67 లక్షలకు చేరడమే ఇందుకు నిదర్శనం. అసలింతకీ ఈ ఈటీఎఫ్​లు ఎలా పని చేస్తాయి? వాటితో ప్రయోజనాలు ఏంటి?

ETFs
ఈటీఎఫ్‌లు
author img

By

Published : Nov 8, 2021, 1:51 PM IST

అందుబాటులో ఉన్న అనేక పెట్టుబడి మార్గాల్లో ఎక్స్‌ఛేంజ్‌ ట్రేడేడ్‌ ఫండ్స్‌(ఈటీఎఫ్‌) ఒకటి. గత కొంత కాలంగా వీటికి ఆదరణ బాగా పెరిగింది. 2019 సెప్టెంబరు 30 నాటికి ఈటీఎఫ్‌ నిర్వహణలోని ఆస్తుల మొత్తం విలువ రూ.1.47 లక్షల కోట్లు కాగా.. ఈ ఏడాది సెప్టెంబరు 30 కల్లా అది రూ.3.62 లక్షల కోట్లకు పెరిగింది. సంపన్నులతో పాటు రిటైల్‌ మదుపర్లు కూడా వీటిలో పెట్టుబడి పెట్టడంపై ఆసక్తి చూపిస్తున్నారు. గత ఏడాది కాలంలో ఈ రంగంలో రిటైల్‌ఫోలియోలు రెండింతలై 67 లక్షలకు చేరింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు సైతం అందుకు అనుగుణమైన ఈటీఎఫ్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

ఈటీఎఫ్‌ అంటే..

ఈటీఎఫ్‌లు కూడా స్టాక్స్‌ తరహాలోనే పనిచేస్తాయి. మ్యూచువల్‌ ఫండ్‌ లక్షణాలతో స్టాక్‌ మార్కెట్‌లో అవసరమైనప్పుడు ట్రేడ్‌ చేయగల కొన్ని సెక్యూరిటీల మిశ్రమమే ఈటీఎఫ్‌. మదుపర్ల దగ్గరి నుంచి సమీకరించిన నిధులతో షేర్లు, డెట్‌ సెక్యూరిటీల వంటి వాటిని కొనుగోలు చేస్తారు. వాటన్నింటినీ కలిపి ఒక ఈటీఎఫ్‌ యూనిట్‌ కింద లెక్కగడతారు. అవి స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్‌ అవుతుంటాయి. స్టాక్‌ తరహాలోనే వాటి విలువ రోజురోజుకీ మారుతూ ఉంటుంది.

ఎలా పనిచేస్తాయి..?

ఈటీఎఫ్‌లు ఇటు షేర్లతో పాటు అటు మ్యూచువల్‌ ఫండ్ల వలె కూడా పనిచేస్తాయి. స్టాక్‌ మార్కెట్‌లో కొన్ని ఈటీఎఫ్‌ బ్లాక్‌లు కలిసి షేర్లలాగా వ్యవహరిస్తాయి. ఈటీఎఫ్‌ ఫండ్లు దాదాపు అన్ని స్టాక్‌ ఎక్స్‌ఛేంజీల్లో నమోదై ఉంటాయి. సాధారణ ట్రేడింగ్‌ సమయంలోనే వాటి క్రయవిక్రయాలు జరుగుతాయి.

ఒక ఈటీఎఫ్‌ యూనిట్‌ విలువ దానిలో ఉన్న షేర్లు, సెక్యూరిటీల విలువను బట్టి మారుతూ ఉంటుంది. యూనిట్‌లో ఏ ఒక్క దాని ధర పెరిగినా ఈటీఎఫ్‌ ధర కూడా పెరుగుతుంది. ఈటీఎఫ్‌ కంపెనీ ఆదాయం, లాభాలను బట్టి మదుపర్లకు డివిడెండ్‌ కూడా అందే అవకాశం ఉంది.

ఈటీఎఫ్‌లో రకాలు..

  • ఈక్విటీ ఈటీఎఫ్‌: యూనిట్‌లో కేవలం కంపెనీల ఈక్విటీ షేర్లు మాత్రమే ఉంటే.. వాటిని ఈక్విటీ ఈటీఎఫ్‌ అంటారు.
  • గోల్డ్‌ ఈటీఎఫ్‌: ఇది కమొడిటీ ఎక్స్‌ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌. దీంట్లో చేసే మదుపుతో కంపెనీలు భౌతిక బంగారాన్ని కొని భద్రపరుస్తాయి. అయితే, మనకు మాత్రం పేపర్‌పై మాత్రమే దాని విలువ కనబడుతుంది.

డెట్‌ ఈటీఎఫ్‌: స్థిర ఆదాయం ఇచ్చే డెట్‌, గవర్నమెంట్‌ బాండ్స్‌ వంటి సెక్యూరిటీల్లో మదుపు చేస్తే వాటిని డెట్‌ ఈటీఎఫ్‌లు అంటారు.

కరెన్సీ ఈటీఎఫ్‌: కరెన్సీ మారకపు విలువలో వచ్చే మార్పుల ఆధారంగా మదుపు చేస్తే దాన్ని కరెన్సీ ఈటీఎఫ్‌ అంటారు.

వీటితో పాటు లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌, మిక్స్‌డ్‌ ఈటీఎఫ్‌, నిఫ్టీ50 ఈటీఎఫ్‌, నిఫ్టీ నెక్ట్స్‌ 50 ఈటీఎఫ్‌... ఇలా మదుపర్ల లక్ష్యం, అవసరాన్ని బట్టి కూడా ఫండ్‌ సంస్థలు వివిధ రకాల ఈటీఎఫ్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

ప్రయోజనాలు..

నేరుగా ఈక్విటీల్లో మదుపు చేయడంపై..

నేరుగా ఓ కంపెనీ షేర్లు కొనడం వల్ల రాబడి కేవలం ఆ కంపెనీ పనితీరుపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇది చాలా నష్టభయంతో కూడుకున్న వ్యవహారం. అదే ఈటీఎఫ్‌లో మదుపు చేస్తే.. మీ పెట్టుబడిని వివిధ కంపెనీల షేర్లు, ఇతర సెక్యూరిటీల కిందకు వివిధీకరిస్తారు. దీంతో నష్టభయం చాలా వరకు తగ్గుతుంది. యూనిట్‌లో ఉన్న ఒక సెక్యూరిటీ నష్టాలనిచ్చినా.. మిగిలినవి రాణిస్తే రాబడిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. ఒకవేళ నష్టపోతున్న సెక్యూరిటీల కంటే లాభపడుతున్న వాటి సంఖ్య లేదా విలువ ఎక్కువైతే.. ఆటోమేటిగ్గా ఈటీఎఫ్‌ యూనిట్‌ ధర సైతం పెరుగుతుంది.

మ్యూచువల్‌ ఫండ్లపై..

మ్యూచువల్‌ ఫండ్లతో పోలిస్తే రుసుములు చాలా తక్కువ. ఎంట్రీ, ఎగ్జిట్‌ లోడ్‌, నిర్వహణ ఛార్జీలు.. ఇవేవీ ఉండవు. దీంతో ఎంఎఫ్‌లతో పోలిస్తే.. ఈటీఎఫ్‌ల కొనుగోలు వ్యయం చాలా తక్కువ.

త్వరగా నగదు రూపంలోకి..

ఈటీఎఫ్‌లు స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడవుతున్న కారణంగా దాని విలువలో వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు గమనించవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించవచ్చు. ఈ నేపథ్యంలో మ్యూచువల్‌ ఫండ్లతో పోలిస్తే.. త్వరగా నగదు రూపంలోకి మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. పైగా బాగా రాణిస్తున్న స్టాక్స్‌ని మాత్రమే ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉన్న కారణంగా నష్టభయం కూడా చాలా తక్కువ.

మ్యూచువల్‌ ఫండ్స్‌ వర్సెస్‌ ఈటీఎఫ్‌..

  • ఈటీఎఫ్‌లను నిర్వహించడానికి ప్రత్యేకంగా ఓ ఫండ్‌ మేనేజర్‌ అవసరం లేదు. అదే మ్యూచువల్‌ ఫండ్లలో మార్కెట్‌పై మంచి పట్టున్న వ్యక్తులు మనం చేసే మదుపుని నిర్వహిస్తుంటారు.
  • ఏ మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్‌ని కొనుగోలు చేయాలన్నది మన చేతుల్లో ఉండదు. అలా కావాలనుకున్నప్పుడు ఫండ్‌ మేనేజర్‌కి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయాలి. అదే ఈటీఎఫ్‌లు మార్కెట్‌లో ట్రేడవుతాయి కాబట్టి.. మనకు నచ్చిన వాటిని కొనుగోలు చేయొచ్చు.
  • ట్రేడింగ్‌ సెషన్‌ చివర్లో మాత్రమే మ్యూచువల్‌ ఫండ్లు ట్రేడవుతాయి. అదే ఈటీఎఫ్‌లు రోజులో ఎప్పుడైనా విక్రయించొచ్చు. కొనొచ్చు.
  • ఈటీఎఫ్‌లకు ఎలాంటి లాకిన్‌ పీరియడ్‌ ఉండదు. అదే మ్యూచువల్‌ ఫండ్లలో అయితే 9 రోజుల నుంచి మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది.

ఏది బెటర్‌?

మన పెట్టుబడుల్లో వివిధీకరణ(డైవర్సిఫికేషన్‌) కావాలనుకుంటే ఈటీఎఫ్‌, ఎంఎఫ్‌ రెండూ ఉండాల్సిందే. అయితే, కాలపరిమితి, మీ అవసరాలు, నష్టభయాన్ని భరించే సామర్థ్యాన్ని బట్టి రెండింట్లో ఏది ఉత్తమైనది అన్నది ఆధారపడి ఉంటుంది. కొంత మందికి వెంటనే నగదు రూపంలో మార్చుకోవాల్సిన అసవరం ఉండొచ్చు. అలాంటి వారికి ఈటీఎఫ్‌లు ప్రయోజనకరంగా ఉంటాయి. అదే దీర్ఘకాలం మదుపు చేసి ఉంచగల సామర్థ్యం ఉండి.. నష్టభయం వద్దనుకుంటే ఎంఎఫ్‌లు మంచి ఫలితాలిస్తాయి. అయితే, తెలివిగా, పక్కా సమాచారంతో మదుపు చేయగలిగితే.. దీర్ఘకాలంలో రెండింటి మిశ్రమం ఇంకా మంచి రాబడినిస్తుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: Crypto Currency: టాప్​ 10 క్రిప్టో కరెన్సీలు ఇవే..!

ఇదీ చూడండి: డేటా అయిపోయిందా? ఛార్జీలు లేకుండా లోన్ తీసుకోండిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.