ETV Bharat / business

మలేరియా మందు ఎగుమతులపై కేంద్రం కొత్త ట్విస్ట్ - coronavirus precautions

కరోనా చికిత్సలో కీలకంగా భావిస్తున్న మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై కేంద్రం మరింత స్పష్టత ఇచ్చింది. విదేశీ ప్రభుత్వాలకు మాత్రమే ఈ ఔషధం అందిస్తామని, ప్రైవేటు సంస్థలకు కాదని తేల్చిచెప్పింది.

India to export hydroxychloroquine only to foreign governments and not to pvt companies
హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులు విదేశీ ప్రభుత్వాలకు మాత్రమే!
author img

By

Published : Apr 10, 2020, 12:37 PM IST

కొవిడ్​-19 చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాన్ని విదేశీ ప్రభుత్వాలకు మాత్రమే సరఫరా చేస్తోంది కేంద్రం. ప్రైవేటు సంస్థలకు మాత్రం అందించడంలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఔషధం ఇంకా నిషేధిత ఎగుమతుల విభాగంలో ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

"హైడ్రాక్సీక్లోరోక్విన్ నిషేధిత వస్తువుల జాబితాలోనే కొనసాగుతోంది. ప్రైవేట్​-ప్రైవేట్​ కంపెనీ లేదా దేశీయ ఎగుమతిదారుల నుంచి విదేశీ దిగుమతిదారులు మధ్య ఈ ఔషధ వాణిజ్యం నిషేధం. అయితే ఈ సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలకు సాయపడడం భారత్​ విధి. అందుకే తనపై ఆధారపడిన నేపాల్, శ్రీలంక, భూటాన్ లాంటి దేశాల విజ్ఞప్తితో... ఈ ఔషధాల ఎగుమతికి అనుమతించింది భారత్​." - ప్రభుత్వ వర్గాలు

మానవతా దృక్పథంతో...

మలేరియా చికిత్స కోసం ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్​ను.. కరోనా రోగులకు కూడా వాడొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదట ఈ ఔషధం ఎగుమతులపై భారత్​ నిషేధం విధించింది. అయితే ప్రపంచ దేశాల విజ్ఞప్తి మేరకు... మానవతా దృక్పథంతో వీటి ఎగుమతులపై పాక్షికంగా నిషేధాన్ని ఎత్తివేసింది భారత్.

ఇదీ చూడండి: భారత్​కు ఏడీబీ 220 కోట్ల​ డాలర్ల సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.