ETV Bharat / business

ఆవిష్కరణ సూచీలో తొలిసారి టాప్​-50లో భారత్​ - అంతర్జాతీయ ఆవిష్కరణ సూచీలో 48 స్థానంలో భారత్​

మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ ఆవిష్కరణ సూచీలో మొదటి 50 స్థానాల్లో నిలిచింది భారత్​. ఈ సూచీలో మొదటి స్థానంలో స్విట్జర్లాండ్‌ నిలవగా.. తర్వాతి స్థానాల్లో స్వీడన్​, అమెరికా, యూకే దేశాలు ఉన్నాయి.

India ranks 48th in global innovation index
అంతర్జాతీయ ఆవిష్కరణ సూచీలో 48 స్థానంలో భారత్​
author img

By

Published : Sep 2, 2020, 8:50 PM IST

అంతర్జాతీయ ఆవిష్కరణ సూచీలో భారత్‌ తొలిసారిగా మొదటి 50 స్థానాల్లో చోటు సంపాదించింది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ, కార్నెల్‌ విశ్వవిద్యాలయం, ఇన్​సీడ్​ బిజినెస్‌ స్కూల్‌ సంయుక్తంగా విడుదల చేసిన జాబితాలో నాలుగు స్థానాలు మెరుగుపరుచుకున్న భారత్ 48 వ స్థానానికి ఎగబాకింది. ఆవిష్కరణ సూచీలో స్విట్జర్లాండ్‌ మొదటి స్థానంలో నిలవగా.... స్వీడన్‌, అమెరికా, యూకే, నెదర్లాండ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

మొత్తం 131 దేశాలకు ర్యాంకులు కేటాయించారు. దేశంలోని సంస్థలు, మానవ మూలధనం-పరిశోధన, మౌలిక సదుపాయాలు, మార్కెట్‌- వ్యాపార ఆధునీకరణ, సాంకేతికత, సృజనాత్మక ఉత్పాదనలు వంటి వాటిని ప్రామాణికంగా తీసుకున్నారు. మరోవైపు సమాచారం - కమ్యూనికేషన్‌ సాంకేతికత, సేవల ఎగుమతి, ప్రభుత్వం ఆన్‌లైన్‌ సేవలు, సైన్స్‌, ఆర్‌ అండ్‌ డీ వంటి విభాగాల్లో భారత్‌ తొలి 15 స్థానాల్లో నిలిచింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.