ETV Bharat / business

Debt of india: దేశం అప్పు రూ.135 లక్షల కోట్లు

India debt 2021: గత 70 ఏళ్లలో భారతదేశ అప్పు 5.29 లక్షల శాతం పెరిగింది. 1950-51లో దేశం నికర అప్పు రూ.2,565.40 కోట్లు ఉండగా, 2021-22 నాటికి అది రూ.1,35,86,975.52 కోట్లకు చేరింది.

india debt 2021
నోట్లు
author img

By

Published : Dec 12, 2021, 7:16 AM IST

India debt 2021 in rupees: భారతదేశ అప్పు గత 70 ఏళ్లలో 5.29 లక్షల శాతం పెరిగింది. 1950-51లో దేశం నికర అప్పు రూ.2,565.40 కోట్లు ఉండగా, 2021-22 నాటికి అది రూ.1,35,86,975.52 కోట్లకు చేరింది. సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్‌ సహ చట్టం కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సమాధానం ఇచ్చింది.

India debt 2014 vs 2021:

2014-15 నాటికి దేశ నికర అప్పు రూ.62,42,220.92 కోట్లు ఉండగా, 2021-22 బడ్జెట్‌ నాటికి అది రూ.1,35,86,975.52 కోట్లకు చేరింది. ఏడేళ్లలో 117% పెరిగింది. 64 ఏళ్లలో దేశం రుణం రూ.62.42 లక్షల కోట్ల మేర ఉండగా, గత ఏడేళ్లలోనే కొత్తగా రూ.73,44,754 కోట్ల అప్పు చేసినట్లు ఈ సమాచారం ద్వారా వెల్లడైంది. 1950-51లో దేశ అంతర్గత రుణం రూ.2,022.30 కోట్లు, విదేశీ రుణం రూ.32.03 కోట్లమేర ఉండగా, 2021-22 నాటికి అంతర్గత రుణం రూ.1,13,57,415 కోట్లు, విదేశీ రుణం రూ.4,27,925.24 కోట్లకు ఎగబాకింది. ఏడు దశాబ్దాల క్రితం చమురు మార్కెటింగ్‌ కంపెనీలు, ఎరువుల కంపెనీలు, ఎఫ్‌సీఐకి రాయితీ కింద చెల్లించాల్సిన బకాయిలు ఏమీ లేవు. ఇప్పుడు ఆ రాయితీల భారం రూ.1,62,827.90 కోట్లకు చేరింది.

ఇదీ చదవండి:'డిసెంబరు 15 నాటికి నిరసన స్థలాలు పూర్తిగా ఖాళీ చేస్తాం'

Pinaka Rocket: పినాక రాకెట్​ లాంచర్​ విస్తరణ ప్రయోగం విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.