ETV Bharat / business

కరోనా కాలంలో క్రెడిట్​ కార్డు వాడాలా వద్దా? - కరోనా సమయంలో క్రెడిట్​ కార్డుల వినియోగం

కరోనాకు ముందు సినిమాలు చూడటం, షాపింగ్​ చేయడం, రెస్టారెంట్లలో డైనింగ్ వంటివి ఎక్కువగా ఉండేవి. వీటన్నింటికీ క్రెడిట్​ కార్డుల ద్వారా చెల్లింపులు చేయడం ద్వారా అదనపు ప్రయోజనాలు పొందే వీలుండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రయోజనాలు ఏమీ పొందకపోయినా... ఛార్జీల భారం తప్పడం లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ వార్షిక ఛార్జీలు తగ్గించుకునే వీలుందంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకోండి...

covid effect on credit card usage
క్రెడిట్​ కార్డుల వినియోగంపై కరోనా ప్రభావం
author img

By

Published : Aug 23, 2020, 12:47 PM IST

కరోనా వల్ల చాలా మంది ఆదాయాలు భారీగా తగ్గిపోయాయి. వారు ఖర్చు చేసే తీరు కూడా మారిపోయింది. ఫలితంగా క్రెడిట్ కార్డుల వినియోగం పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డును భారంగా భావిస్తున్న చాలా మంది.. దాన్ని రద్దు చేసుకోవాలనే యోచనలో ఉన్నారు. అయితే క్రెడిట్​ కార్డుల రద్దు సరైన నిర్ణయం కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. కార్డు రద్దు కంటే డౌన్​గ్రేడ్‌ చేసుకోవటం మేలని సూచిస్తున్నారు.

ఇంతకీ డౌన్​గ్రేడ్ చేసుకోవడం అంటే ఏమిటి? డౌన్​గ్రేడ్​తో ప్రయోజనం ఎంత? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డు రకం ఆధారంగా ప్రయోజనాలు

క్రెడిట్‌ కార్డు రకం ఆధారంగా ప్రయోజనాలు ఉంటాయి. ట్రావెల్‌, డైనింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, షాపింగ్​కు సంబంధించినవి ఇందులో ఉంటాయి. ప్రస్తుతం కరోనా వల్ల ప్రయాణాలు, బయటం తినటం, సినిమాలు తగ్గిపోయాయి. దీనితో కార్డులను ఉపయోగించి ప్రయోజనాలు పొందే పరిస్థితి లేదు. అయినప్పటీ.. వాటిపై వార్షిక ఛార్జీలు లాంటి భారం మోయాల్సి ఉంటుంది. డౌన్​గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు.

వార్షిక రుసుము తప్పించుకోవడం ఎలా?

క్రెడిట్‌ కార్డు ద్వారా ఖర్చు చేసినప్పుడు రివార్డులు వస్తుంటాయి. ఈ రివార్డులు, ఇతర క్రెడిట్‌ కార్డు ప్రయోజనాల వల్ల కలిగే లాభం కంటే.. వార్షిక ఛార్జీలు ఎక్కువైనప్పుడు క్రెడిట్‌ కార్డు గురించి పునరాలోచించాలి. రివార్డులు ఉపయోగించని స్థితిలో తక్కువ రివార్డులు ఉన్న వాటికి డౌన్​గ్రేడ్ చేయించుకోవడం​ ఉత్తమం. అలా కాకుండా.. కార్డును రద్దు చేస్తే క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం పడుతుంది. కాబట్టి డౌన్‌గ్రేడ్‌ చేసుకోవటం ఉత్తమమైన ఎంపికని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు అంటున్నారు.

డౌన్‌గ్రేడ్‌ చేసుకోవటం అంటే తక్కువ వార్షిక రుసుము ఉండే కార్డుకు మారిపోవటం. దీనివల్ల క్రెడిట్ హిస్టరీ కొనసాగుతుంది. దీనితో పాటు కార్డు యూసేజీ పెరిగి.. ఛార్జీలు రద్దయ్యే అవకాశం ఉంది. ఫలితంగా మెరుగైన క్రెడిట్‌ స్కోరు కొనసాగుతుంది. క్రెడిట్ కార్డు డౌన్​గ్రేడ్​ కోసం సంబంధిత బ్యాంకును సంప్రదించాలి.

కొనసాగిస్తేనే మెరుగైన క్రెడిట్‌ స్కోరు

క్రెడిట్‌ యుటిలైజేషన్‌ క్రెడిట్‌ స్కోరులో ఒక భాగం. క్రెడిట్‌ కార్డును కొనసాగిస్తే.. క్రెడిట్‌ యుటిలైజేషన్‌ మెరుగవుతుంది. ఇది మంచి క్రెడిట్​ స్కోరుకు ఉపయోగపడుతుంది. అదే కార్డు రద్దు చేస్తే.. క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఎక్కువ కార్డులున్న వారు రద్దు చేసుకోవాలా?

ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్నవారు ప్రస్తుత పరిస్థితుల్లో.. ఎక్కువగా వాడే కార్డు (మీ అవసరాలకు తగ్గ క్రెడిట్ లిమిట్​ ఉండే కార్డు) తప్ప మిగతా వాటిని రద్దు చేసుకున్నా మంచిదే అని చెబుతున్నారు నిపుణులు. దాని వల్ల క్రెడిట్​ స్కోరుపై పెద్దగా ప్రభావం ఉండదని అంటున్నారు.

పూర్తిగా కార్డులను రద్దు చేసుకోకుండా.. డౌన్​గ్రేడ్​, కార్డుల సంఖ్యను తగ్గించుకోవడం వల్ల.. మంచి క్రెడిట్​ స్కోరు ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. దీని ద్వారా భవిష్యత్​లో రుణాలు తీసుకోవడం సులభతరమవుతుందని అంటున్నారు.

ఇదీ చూడండి:బంగారంపై పెట్టుబడి పెట్టాలా? అయితే ఇది చదవాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.