Hero Motocorp News: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. వచ్చే నెల 4 నుంచి ద్విచక్ర వాహన ధరలను రూ.2వేల వరకు పెంచనుంది. ఇన్‌పుట్ కాస్ట్ పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అన్ని మోడళ్ల ఎక్స్‌షోరూమ్ ధరలు మార్చనున్నట్లు తెలిపింది. ముడిసరకు ధరలు పెరగడం వల్లే ధరలు పెంచుతున్నామని, మోడళ్లను బట్టి పెంపు వర్తిస్తుందని పేర్కొంది.
Volkswagen Cars in India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ సైతం కార్ల ధరలను పెంచనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. జనవరి 1 నుంచి 2-5 శాతం మేర ఈ పెంపు ఉంటుందని తెలిపింది. పోలో, వెంటో, టైగన్ మోడళ్లపై వేరియంట్‌ను బట్టి పెంపు ఉంటుందని, ఇటీవల విడుదల చేసిన టైగన్ మోడల్‌కు ఈ పెంపు వర్తించదని పేర్కొంది. ముడిసరకు సహా కార్యకలాపాల ఖర్చులు పెరగడంతో ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీ ఇండియా డైరెక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు. మరోవైపు ఇతర కార్ల తయారీ కంపెనీలైన మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్, స్కోడా కూడా ధరల పెంపుపై ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి.
ఇదీ చదవండి: అపాచీ సరికొత్త రేసింగ్ బైక్- ధర ఎంతంటే?