ETV Bharat / business

2020-21లో భారత వృద్ధి రేటు 1.5%: సీఐఐ - 2020-21లో భారత వృద్ధి రేటు 1.5%

2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 1.5 శాతం ఉండే అవకాశం ఉందని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అంచనా వేస్తోంది. లాక్​డౌన్ ఇంకా కొనసాగితే దేశ వృద్ధిరేటు 0.9 శాతం వరకు క్షీణించవచ్చని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఒక ప్రణాళికను సీఐఐ విడుదల చేసింది.

Growth rate of 1.5% in 2020-21: CII
2020-21లో భారత వృద్ధి రేటు 1.5%: సీఐఐ
author img

By

Published : Apr 24, 2020, 5:23 AM IST

ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) దేశ వృద్ధి రేటు 1.5 శాతం వరకు నమోదయ్యే అవకాశం ఉందని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అంచనా వేస్తోంది. కరోనా వైరస్‌ ప్రభావం, దాని వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలంగా ఉందని నివేదికలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఒక ప్రణాళికను సీఐఐ విడుదల చేసింది. మూడు పరిస్థితుల్లో వృద్ధి అంచనాలను పేర్కొంటూ, అత్యవసర ఆర్థిక జోక్యం చేసుకోవల్సిన అవసరాన్ని సూచించింది.

  • మొదటి పరిస్థితిలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 0.6 శాతం మేర వృద్ధి చెందొచ్చు. లాక్‌డౌన్‌ కాలానికి మించి వస్తువులు, ప్రజల స్వేచ్ఛా కదలికలపై నిరంతర పరిమితుల కారణంగా, ఆర్థిక కార్యకలాపాలు నిర్బంధంగా ఉంటే మొదటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఇది సరఫరా వ్యవస్థల్లో అంతరాయం కలిగిస్తుంది. అలాగే పెట్టుబడి కార్యకలాపాలు నెమ్మదించి, స్వల్పకాలానికి కార్మికుల కొరత ఏర్పడి, తగ్గిన కుటుంబ ఆదాయాల కారణంగా వినియోగ గిరాకీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది.
  • ఆశావాద దృక్పథంతో చూస్తే, లాక్‌డౌన్‌ తర్వాత ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా పుంజుకుంటే, జీడీపీ వృద్ధి రేటు 1.5 శాతం నమోదయ్యే అవకాశం ఉంది.
  • ఒకవేళ కరోనా వైరస్‌ వ్యాప్తి దీర్ఘకాలం కొనసాగి, ప్రస్తుత హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో పరిమితులు మరింత కాలం పొడిగించడంతో పాటు కొత్త హాట్‌స్పాట్లను గుర్తిస్తే ఆర్థిక కార్యకలాపాలు మందగించి జీడీపీ -0.9 శాతానికి క్షీణించే అవకాశం ఉంది.

ఆర్థిక జోక్యం అత్యవసరం

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన రూ.1.7 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీకి తోడు జన్‌ధన్‌ ఖాతాల్లోకి రూ.2 లక్షల కోట్ల నగదు బదిలీ జరగాల్సిన అవసరం ఉందని సీఐఐ సూచించింది. దీంతో పాటు బ్యాంకులు అదనపు వర్కింగ్‌ క్యాపిటల్‌ పరిమితులు అందించాలి. ప్రభుత్వం హామీ ఇచ్చి, 4-5 శాతం వడ్డీ రేటుతో ఏప్రిల్‌-జూన్‌ వేతనాల బిల్లుకు సమానమైన మొత్తాన్ని రుణగ్రహీతలకు అందించాలని అభిప్రాయపడింది. రూ.1.5 లక్షల కోట్లతో కార్పస్‌ నిధి లేదా స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఇందులో రూ.10,000-20,000 కోట్లు ప్రభుత్వం సమకూర్చి, మిగతా మొత్తాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు (ఎల్‌ఐసీ, పీఎఫ్‌సీ, ఈపీఎఫ్‌, ఎన్‌ఐఐఎఫ్‌, ఐఐఎఫ్‌సీఎల్‌ వంటివి) సమకూర్చేలా చూడాలని కోరింది. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకొస్తే రుణ భద్రత (క్రెడిట్‌ ప్రొటెక్షన్‌) పథకాన్ని అమలు చేయాలని సూచించింది. ఈ సంస్థలు తీసుకున్న రుణ మొత్తంలో 75-80 శాతానికి ఆర్‌బీఐ గ్యారెంటీ ఇచ్చేలా ఈ పథకం ఉండాలని, అప్పుడు ఏ సంస్థ అయినా డిఫాల్ట్‌ అయితే ఆర్‌బీఐ ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేలా చూడాలని కోరింది. అప్పుడు రుణదాతలకు రిస్క్‌ తక్కువగా ఉంటుందని సీఐఐ అభిప్రాయపడింది. పరిశ్రమ, వాణిజ్య రుణాలకు సిడ్బీ, అగ్రో-ప్రాసెసింగ్‌ రంగాల రుణాలకు నాబార్డ్‌లు క్రెడిట్‌ గ్యారెంటీ ఇవ్వాలని సూచించింది.

ప్రభుత్వం ఏదైనా చేయాలి

ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి భారత్‌లో వ్యయాలు పెరగాల్సిన అవసరం ఉంది. ఈ దశలో ప్రభుత్వం ఏదైనా చేయాల్సిన అవసరం ఉంద’ని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ వెల్లడించారు.

వృద్ధి రేటు 0.8 శాతమే: ఫిచ్‌ రేటింగ్స్‌

2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత్‌ వృద్ధి రేటు 0.8 శాతంగా నమోదు కావొచ్చని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంతో పాటు దేశీయంగా కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో వృద్ధి రేటులో కోత విధిస్తున్నట్లు పేర్కొంది. 2021-22లో వృద్ధి గాడిన పడి మళ్లీ 6.7 శాతానికి చేరుకోవచ్చని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవ్సతరం తొలి త్రైమాసికంలో (-)0.2 శాతం, రెండో త్రైమాసికంలో (-)0.1 శాతం మేర వృద్ధి నమోదు కావొచ్చని పేర్కొంది. మూడో త్రైమాసికంలో 1.4 శాతం మేర వృద్ధి నమోదు కావొచ్చని పేర్కొంది.

ఇదీ చూడండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్​ పెంపు నిలుపుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.