ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన బంగార ధర మళ్లీ పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి శుక్రవారం రూ.224 పెరిగి.. రూ.52,672 వద్దకు చేరింది.
కరెన్సీ మార్కెట్లో రూపాయి విలువ భారీగా పెరగటం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్.. దేశీయంగా బంగారం ధరలు పెరిగేందుకు కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.
వెండి ధర కూడా గురువారం కిలోకు రూ.620 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.69,841 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,954 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 27.13 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇదీ చూడండి:గూగుల్ ప్లేస్టోర్ నుంచి పేటీఎం ఔట్..