బంగారం ధర బుధవారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.111 ఎగిసి.. రూ.50,743 వద్దకు చేరింది.
ఇటీవల వరుసగా రూపాయి విలువ తగ్గుతుండటం.. పసిడి ధరల పెరుగుదలకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా పసిడి ధరలపై పడిందని అంటున్నారు.
పుత్తడికి వ్యతిరేకంగా వెండి ధర మాత్రం కిలోకు భారీగా రూ.1,266 దిగొచ్చింది. కిలో ధర ప్రస్తుతం రూ.60,669 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,895 డాలర్లకు తగ్గింది. వెండి ధర ఔన్సుకు 23.60 డాలర్లకు దిగొచ్చింది.
ఇదీ చూడండి:మార్కెట్లకు మళ్లీ లాభాలు- ఐటీ, ఫార్మా జోరు