ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర స్థిరంగా కొనసాగుతోంది. వెండి ధర (Silver price today) స్వల్పంగా తగ్గింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర (Gold Price in Hyderabad) రూ.49,100 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.515 తగ్గి రూ.66,655 వద్ద ఉంది.
- విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.49,100గా ఉంది. కిలో వెండి ధర రూ.66,655 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.49,100గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,655 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,788 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
- ఔన్సు స్పాట్ వెండి ధర 24.22 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఇంధన ధరల పెంపు..
చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. తాజాగా దిల్లీలో శుక్రవారం పెట్రోల్, డీజిల్పై లీటర్కు (Petrol price hike) 35 పైసలు చొప్పున పెరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లో..
- హైదరాబాద్లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ ధర 36 పైసలు పెరిగింది. ఫలితంగా లీటర్ రూ.111.14కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 38 పైసలు అధికమై.. లీటర్ రూ.104.28 కి చేరింది.
- గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 71 పైసలు పెరిగి.. లీటర్ రూ.112.48కి చేరింది. డీజిల్పై 74 పైసలు పెరిగి లీటర్ రూ.104.99 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.112.90 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.50కి చేరింది.
ఇదీ చూడండి : పండగ సమయంలో కొలువుల జాతర