ETV Bharat / business

ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓలతో శుక్రవారం నిర్మల భేటీ - నిర్మలా సీతారామన్ వార్తలు

ఆర్థిక ప్యాకేజీ అమలుకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ శుక్రవారం సమావేశంకానున్నారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగే ఈ భేటీలో పథకాల అమలులో వివిధ అంశాలపై చర్చించనున్నారు.

BIZ-VIRUS-FM-BANKS
ప్రభుత్వ రంగ బ్యాంకులతో నిర్మల భేటీ
author img

By

Published : May 21, 2020, 6:54 PM IST

Updated : May 21, 2020, 7:33 PM IST

ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ శుక్రవారం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కరోనా ఆర్థిక ప్యాకేజీతోపాటు పలు రంగాలను ఆదుకునేందుకు రుణ వితరణ వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

ఈ భేటీ మే 11న జరగాల్సి ఉన్నా.. ప్యాకేజీ ప్రకటనల నేపథ్యంలో ఆలస్యమైంది. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగే ఈ భేటీలో అనేక అంశాలపై చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

బ్యాంకుల పనితీరుపైనా..

రుణాల చెల్లింపుపై మారటోరియం, రుణ గ్రహీతలకు వడ్డీ రేట్ల మార్పిడి అంశాలను పరిశీలించనున్నారు. బ్యాంకులు తీసుకురానున్న స్కీములపైనా చర్చ జరగనుంది. వడ్డీ రేట్లను 75 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఇటీవలే ఆర్​బీఐ ప్రకటించింది.

కేంద్రం ప్రకటించి రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని అమలు చేసేందుకు బ్యాంకులే కీలకం కానున్నాయి. 'ఆత్మ నిర్భర్ భారత్​ అభియాన్​' పేరిట ప్రకటించిన ఈ ప్యాకేజీకి సంబంధించిన పథకాలకు బుధవారం కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది.

ఇదీ చూడండి: ప్యాకేజీ కష్టాలు: ఉద్దీపనలకు నిధులు ఎలా?

Last Updated : May 21, 2020, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.