ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈనెల 15న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ గురువారం వెల్లడించారు. ఆర్థిక వ్వవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ప్రైవేటు పెట్టుబడులపై దృష్టి సారించిందన్నారు.
'పెట్టుబడులకు భారత్ ప్రధాన కేంద్రంగా మారుతోంది.. ప్రైవెటు రంగం కూడా ఆసక్తి కనబరుస్తోంది' అని సోమనాథన్ పేర్కొన్నారు.
భూమి, నీటి వినియోగంపై ఉన్న నిబంధనలు సడలించడంపై ఈ భేటీలో ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేఠ్ వెల్లడించారు.
ఇదీ చూడండి : ఆటో సేల్స్‌పై 'చిప్' దెబ్బ- అక్టోబర్‌లో 27% డౌన్