దేశీయ ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పోటా పోటీగా పండుగ సీజన్ ప్రత్యేక సేల్స్ ప్రారంభించాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్(Flipkart Big Billion Days), అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ (Amazon Great Indian Festival Sale) సేల్స్ ఆదివారం నుంచి సాధారణ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చాయి.
ఫ్లిప్‌కార్ట్ ప్లస్, అమెజాన్ ప్రైమ్ యూజర్లకు ఒక రోజు ముందుగానే.. అంటే అక్టోబర్ 2 నుంచే ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ సారి పండుగ డీల్స్ (Festival offers) ఎలా ఉన్నాయి? ఫ్లిప్‌కార్ట్, అమజాన్ ఇస్తున్న ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు ఏమిటి? అనే పూర్తి వివరాలు మీ కోసం.
మొబైల్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ అదిరే ఆఫర్లు..
ఐఫోన్లపై డిస్కౌంట్ల బొనాంజా ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్ (Flipkart festival offers). ఐఫోన్ 12 ధరను (iPhone offers on Flipkart) రూ.49,999కు తగ్గించింది. ఐఫోన్ 12 మినీ ధరను రూ.38,999గా నిర్ణయించింది. ఇక బడ్జెట్ ఐఫోన్ ఎస్ఈ (2020) ధరను రూ.26,999కి తగ్గించింది.
గూగుల్ పిక్సెల్ 4ఏ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.31,999 నుంచి రూ.25,999కి తగ్గించింది ఫ్లిప్‌కార్ట్. దీనితో పాటు గూగుల్ బడ్స్‌పై 50 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
శాంసంగ్ ఎఫ్62 ధరను ఏకంగా రూ.11,000 తగ్గించింది. ఆఫర్ తర్వాత ఈ ఫోన్ ధర రూ.18,999కు దిగొచ్చింది.
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఎఫ్22 ధరను రూ.14,999 నుంచి రూ.12,499కి తగ్గించింది.
ఫోన్లతోపాటు టీవీలు, ఫ్రిడ్జ్‌లు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై భారీ తగ్గింపు ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్.
సేల్ డిస్కౌంట్లతో పాటు.. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల ద్వారా చెల్లింపులు జరిపితే అదనంగా మరో 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభించనుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. పేటీఎం ద్వారా చెల్లింపులు జరిపితే రూ.200 వరకు డిస్కౌంట్ లభించనుందని వెల్లడించింది.
అమెజాన్ ఆఫర్లు ఇలా..
ఈ సేల్‌లో కొనుగోళ్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపితే 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభించనుందని తెలిపింది అమెజాన్.
శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ (6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్) ధరను రూ.25,999కి తగ్గించింది. దీని అసలు ధర రూ.29,999గా ఉంది. కూపన్ ద్వార మరో రూ.1000 డిస్కౌంట్ పొందే వీలుంది.
ఐఫోన్ 11 (64 జీబీ) ధరను రూ.38,999గా నిర్ణయించింది అమెజాన్.
రెడ్మీ 50 4కే టీవీ ధరను రూ.44,999 నుంచి రూ.35,999కి తగ్గించింది. ఎక్స్ఛేంజ్ ద్వారా మరింత డిస్కౌంట్ పొందే వీలుంది.
ఇదీ చదవండి: