ETV Bharat / business

బీఎస్​ఎన్​ఎల్​-4జీలో చైనా ఉపకరణాలపై నిషేధం! - DoT latest news

చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్​ఎన్​ఎల్​ 4జీ అప్​గ్రెడేషన్​లో చైనా ఉపకరణాలను వినియోగించొద్దని సూచించనుంది. ప్రైవేటు సంస్థలూ చైనా వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించే చర్యలను పరిశీలిస్తోంది.

BSNL not to use Chinese telecom equipment in 4G upgradation
బీఎస్​ఎన్​ఎల్​-4జీలో చైనా పరికరాలపై నిషేధం!
author img

By

Published : Jun 18, 2020, 5:19 AM IST

భారత్​-చైనా మధ్య లద్దాక్​లోని సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది టెలికాం విభాగం (డాట్​). ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్​ సంచార్​ నిగమ్​ లిమిటెడ్​​ (బీఎస్​ఎన్ఎల్​) 4జీ సేవల అభివృద్ధిలో చైనా ఉపకరణాలను వినియోగించొద్దని సూచించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

" బీఎస్​ఎన్​ఎల్​ 4జీ అప్​గ్రెడేషన్​లో చైనా పరికరాలను వినియోగించొద్దని సూచించాలని టెలికాం విభాగం చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. 4జీ టెండర్​ పనుల విషయంలో పునఃపరిశీలించాలని టెలికాం శాఖ సూచించనుంది. ఇలాంటి ఆదేశాలే మహానగర్​ టెలికాం నిగమ్​ లిమిటెడ్​ (ఎంటీఎన్​ఎల్​)కూ చేయనుంది. చైనాలో తయారయ్యే టెలికాం ఉత్పత్తులపై ప్రైవేటు సంస్థలు అధికంగా ఆధారపడటాన్ని తగ్గించేలా చర్యలను పరిశీలిస్తోంది. గతంలో చైనా ఉత్పత్తుల నెట్​వర్క్​ భద్రతపై ఆందోళనలు చెలరేగాయి."

- టెలికాం శాఖ అధికార వర్గాలు.

గాల్వన్​ లోయలో సైనికుల మధ్య ఘర్షణ తలెత్తి 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారత్​లో చైనా వ్యతిరేకత పెరిగింది. సరిహద్దు ప్రతిష్టంభనకు నిరసనగా చైనా వస్తువులను నిషేధించాలని పరిశ్రమల సమాఖ్య (సీఏఐటీ) వంటి వాణిజ్య సంస్థలు సహా పలువురు ఆందోళనకారులు డిమాండ్​ చేస్తున్నారు.

ఇదీ చూడండి: కరోనా రోగులకు ప్రాణదాతగా మారిన ఔషధం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.