ETV Bharat / business

36 ఏళ్ల తర్వాత కోకాకోలా​ రుచిలో మార్పు! - కోకాకోలా కొత్త ఫ్లేవర్​

1985లో కోక్​ రుచిలో మార్పులు చేసి విమర్శలు మూటగట్టుకున్న కోకాకోలా సంస్థ మరోసారి కోక్​ రుచిని మార్చేందుకు సిద్ధమవుతోంది. మరింత రుచికరంగా మార్చేందుకే తాము ఇలా చేస్తున్నామని ఆ సంస్థ చెబుతున్నప్పటికీ కోక్​ ప్రియులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.

Coca-Cola change flavour
కోకాకోలా కోక్​
author img

By

Published : Jul 15, 2021, 7:58 PM IST

కోకాకోలాకు మీరు అభిమానులా? ఎన్నో ఏళ్లుగా కోక్​ రుచిని ఆస్వాదిస్తున్నారా? అయితే.. ఈ సారి మీకు ఓ కొత్త అనుభవాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది కోకాకోలా సంస్థ. తన సోడా డ్రింక్ రెసీపీని మార్చి, సరికొత్త రుచిని పరిచయం చేయాలని భావిస్తోంది.

'మరింత రుచి కోసమే..'

కోకా-కోలా జీరో షుగర్​(కోక్​ జీరో) రుచిని మారుస్తున్నట్లు కోకాకోలా సంస్థ ప్రకటించింది. రుచితోపాటు నలుపు​-ఎరుపు కాంబినేషన్​లో కనిపించే ఈ పానీయం రంగు కూడా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. చివరిసారిగా 1985లో తన సోడా రుచిని మార్చింది ఈ సంస్థ.

'కోక్​ను వదిలేస్తాం'

అయితే ఏదేమైనా కోక్​ ప్రియులు మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవటం లేదు. సామాజిక మాధ్యమాల్లో కోకా కోలా నిర్ణయానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. కొంతమంది తాము కోక్​ను వదిలేసి వేరే పానీయాన్ని తాగుతామని చెబుతుండగా.. మరికొందరేమో.. తాము పెప్సీనే ఇకపై తాగుతామని అంటున్నారు.

ఈ కొత్త రుచితో వచ్చే కోక్​ను అమెరికాలో ఈ నెలలోనే విడుదలు చేయనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నాటికి కెనడాలో దీన్ని తీసుకురానున్నారు. 1985లో కోక్​ రుచిని మారుస్తూ 'న్యూ కోక్​' విడుదల చేసిందీ సంస్థ. అయితే.. ఎక్కువ తీపిగా ఉందన్న కారణంతో దీనిని చాలామంది తిరస్కరించారు.

ఇదీ చూడండి: Coca cola: రొనాల్డో వద్దన్నాడు.. లియోనార్డో తాగాడు!

ఇదీ చూడండి: రొనాల్డో దెబ్బకు కోకాకోలా కంపెనీకి 30వేల కోట్ల నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.