ETV Bharat / business

సహకార బ్యాంకులపైనా ఇక ఆర్​బీఐ పర్యవేక్షణ - బ్యాంకింగ్ రెగ్యరులేషన్​ సవరణ

సహకార బ్యాంకుల రెగ్యులేషన్ సవరణ ఆర్డినెన్స్ 2020కి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న 1,540 సహకార బ్యాంకులు ఆర్​బీఐ నియంత్రణ పరిధిలోకి వచ్చాయి.

Co-op banks come under RBI
ఆర్​బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు
author img

By

Published : Jun 27, 2020, 12:59 PM IST

Updated : Jun 27, 2020, 4:03 PM IST

దేశవ్యాప్తంగా సహకార బ్యాంకులను ఆర్​బీఐ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ 2020కి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. సహకార బ్యాంకులపై నమ్మకం పెంచేందుకు బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ సవరణ ఆర్డినెన్స్‌కు ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ శనివారం ఆమోదముద్ర వేశారు. దీనితో ఈ ఆర్డినెన్స్ ప్రక్రియ పూర్తయింది.

Ramnath kovind
రామ్​నాథ్​ కోవింద్, భారత రాష్ట్రపతి

ఆర్డినెన్స్ ఉద్దేశం, ఉపయోగాలు..

దేశవ్యాప్తంగా ఉన్న 1,482 పట్టణ, 58 బహుళ రాష్ట్రాల (మల్టీస్టేట్‌) సహకార బ్యాంకులను ఆర్​బీఐ నియంత్రణ పరిధిలోకి తీసుకురావడం ఈ ఆర్డినెన్స్ ముఖ్య ఉద్దేశం.

ఇకపై షెడ్యూల్డ్ బ్యాంకులలానే 1,540 సహకార బ్యాంకులపైనా ఆర్​బీఐ పర్యవేక్షణ ఉండనుంది.

ఆర్డినెన్స్​తో 1,540 బ్యాంకుల్లో.. 8.40 కోట్ల మంది ఖాతాదారులు చేసిన రూ.4.84 లక్షల కోట్ల డిపాజిట్లకు భద్రత చేకూరనుంది.

ఇదీ చూడండి:పుత్తడి ధరలకు రెక్కలు- రూ. 65వేల దిశగా..!

Last Updated : Jun 27, 2020, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.