ETV Bharat / business

గుడ్ న్యూస్: ఆగస్టు వరకు పీఎఫ్ భారం​ కేంద్రానిదే - PF CONTRIBUTION

కేంద్ర మంత్రివర్గం చిరుద్యోగులకు ఊరట కలిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు వరకు ఉద్యోగి, యజమానుల ఈపీఎఫ్ భారాన్ని (12+12 శాతం)... గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద కేంద్రమే భరించే ప్రతిపాదనను ఆమోదించింది. దీని వల్ల వల్ల 3.67 లక్షల మంది యజమానులకు, 72.22 లక్షల మంది ఉద్యోగులకు ఉపశమనం కలగనుంది.

EPF
పీఎఫ్ కంట్రిబ్యూషన్
author img

By

Published : Jul 8, 2020, 5:21 PM IST

వేతన జీవులకు ఊరట కలిగిస్తూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్​ భారం [ఉద్యోగి, యజమాని ఇద్దరి వాటాలను (12+12)] కేంద్రమే భరించేలా తీసుకొచ్చిన పథకాన్ని మరో మూడు నెలల వరకు పొడిగించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

దీని ప్రకారం... రూ.15 వేలలోపు వేతనం ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జూన్​, జులై, ఆగస్టు నెలలకు చెందిన ఈపీఎఫ్‌ కంట్రిబ్యూషన్​ను కేంద్రమే భరిస్తుంది. 100 లోపు ఉద్యోగులున్న సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

టేక్ హోం సేలరీ పెంపు

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మే నెలలోనే ఈ విషయంపై ప్రకటన చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద... ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ కంట్రిబ్యూషన్ భారాన్ని ఆగస్టు వరకు ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు.

"కంపెనీల, ఉద్యోగుల పీఎఫ్ కంట్రిబ్యూషన్​ మొత్తాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాం. దీనితో ఉద్యోగుల చేతికి అందే జీతం (టేక్ హోమ్ సేలరీ) పెరుగుతుంది."

- ప్రకాశ్ జావడేకర్, కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి

తాజా నిర్ణయం ప్రకారం, ఉద్యోగి, యజమాని ఇద్దరి వాటాల పీఎఫ్ భారం (12+12 శాతం) ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఫలితంగా 3.67 లక్షల మంది యజమానులకు, 72.22 లక్షల మంది ఉద్యోగులకు ఉపశమనం కలగనుంది.

ఇదీ చూడండి: 'సమగ్ర రవాణా వ్యవస్థ అభివృద్ధికి కొత్త లాజిస్టిక్స్​ చట్టం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.