ETV Bharat / business

బ్యాంకులు బంద్- ఆ లావాదేవీలపై ప్రభావం - బ్యాంకులు బంద్

Bank Strike News: ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగారు. రెండు రోజుల పాటు సాగే ఈ బంద్ బ్యాంక్​ కార్యకలాపాలపై ప్రభావం చూపనుంది.

banks strike
దేశవ్యాప్తంగా బ్యాంకుల బంద్-ట్రాన్సాక్షన్స్​పై ప్రభావం
author img

By

Published : Dec 16, 2021, 1:11 PM IST

Updated : Dec 16, 2021, 2:44 PM IST

Bank Strike News: బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ యునైటెడ్​ ఫోరమ్​ ఆఫ్​ బ్యాంక్​ యూనియన్స్ (యూఎఫ్​బీయూ)​ గురువారం సమ్మె చేపట్టింది. తొమ్మిది యూనియన్లతో కూడిన ఈ ఫోరం ఈనెల 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు స్ట్రైక్​ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించింది. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా 9 లక్షల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారని యూనియన్లు వెల్లడించాయి.

bank strike news
అహ్మదాబాద్​లో నిరసనలు
bank strike news
దిల్లీలో నిరసనలు

ఈ సమ్మె దేశవ్యాప్తంగా లక్ష బ్రాంచ్​లపైన ప్రభావం చూపిస్తుందన్నారు ఆల్​ఇండియా బ్యాంక్​ ఆఫీసర్స్​ కన్​ఫెడరేషన్​ ప్రధాన కార్యదర్శి సౌమ్యా దత్తా. క్యాష్​ విత్​డ్రా, డిపాజిట్లు, బిజినెస్​ ట్రాన్సాక్షన్స్​, లోన్​ ప్రాసెస్​, చెక్​ క్లియరింగ్​, అకౌంట్​ ఓపెనింగ్​ వంటి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు.

bank strike news
దిల్లీలో నిరసన తెలుపుతున్న బ్యాంక్​ ఉద్యోగులు
bank strike news
హైదరాబాద్​లో బ్యాంక్​ ఉద్యోగుల నిరసనలు
  • మహారాష్ట్రాలో 60వేల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ముంబయిలోని ఆజాద్​ మైదాన్​ వద్ద 5000వేల మందితో నిరసన నిర్వహిస్తామన్నాయి యూనియన్లు.
  • రాజస్థాన్​లో 4వేలకుపైగా బ్రాంచీలకు చెందిన 25వేల మంది ఉద్యోగులు నిరసనలో పాల్గొంటున్నారని యునైటెడ్​ ఫారమ్​ ఆఫ్​ బ్యాంక్​ యూనియన్స్​ ప్రతినిధి మహేశ్​ మిశ్ర వెల్లడించారు. 6,650 ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో ఉండకపోవడం సహా ఈ స్ట్రైక్​ రూ.10వేల కోట్ల లావాదేవీలపై ప్రభావం చూపిస్తుందన్నారు.
  • కర్ణాటక రాజధాని బెంగళూరులోని మైసూర్ బ్యాంక్​ సర్కిల్​ వద్ద నిరసనకు దిగారు బ్యాంకు ఉద్యోగులు. ప్రైవేటీకరణపై ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్​ చేశారు.
    bank strike news
    హైదరాబాద్​లో బ్యాంక్​ ఉద్యోగుల నిరసనలు

అయితే హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ, కొటక్​ మహీంద్ర వంటి ప్రైవేటు బ్యాంకుల్లో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి : ఆ బ్యాంకులకు ఆర్​బీఐ షాక్- రూ.కోటికి పైగా జరిమానా​!

Last Updated : Dec 16, 2021, 2:44 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.