ETV Bharat / business

కొత్తగా బ్యాంక్ లాకర్ తీసుకోవాలా? ఈ రూల్స్ తెలుసుకోండి! - ఆర్​బీఐ కొత్త రూల్స్.. బ్యాంకు లాకర్​

Bank Locker India RBI Rules: బ్యాంకు లాకర్లకు సంబంధించి ఆర్​బీఐ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త నిబంధనలు 2022, జనవరి 1న అమల్లోకి వచ్చాయి. అవేంటో తెలుసుకోండి.

bank locker
బ్యాంకు లాకర్​
author img

By

Published : Jan 4, 2022, 5:41 PM IST

Bank Locker India RBI Rules: బ్యాంకు లాకర్​లో చాలామంది బంగారం, విలువైన ధ్రువపత్రాలు, ఆభరణాలను దాచుకుంటూ ఉంటారు. అయితే బ్యాంకు లాకర్లకు సంబంధించి ఆర్​బీఐ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ రూల్స్ 2022, జనవరి 1న అమల్లోకి వచ్చాయి.

ఆర్​బీఐ కొత్త రూల్స్​ ఇవే..

  • లాకర్​ను కేటాయించే ముందు కస్టమర్ల నుంచి బ్యాంకులు 'టర్మ్ డిపాజిట్​' తీసుకునేందుకు రిజర్వు బ్యాంక్​ ఆఫ్ ఇండియా(ఆర్​బీఐ) అనుమతినిచ్చింది. దీంట్లో మూడేళ్లపాటు అద్దెతోపాటు మిగతా ఛార్జీలు ఉన్నాయి.
  • అయితే ఇప్పటికే లాకర్​లను వినియోగిస్తున్న కస్టమర్లను, ఖాతాను సమగ్రంగా నిర్వహిస్తున్నవారిని టర్మ్ డిపాజిట్​ చేయమని సంబంధిత బ్యాంకులు ఒత్తిడి తేవద్దని ఆర్బీఐ తెలిపింది.
  • బ్యాంకు ఖాతాదారులు వరుసగా మూడేళ్లపాటు లాకర్ అద్దె కట్టకుంటే.. ఏ లాకర్​నైనా బ్రేక్​ చేసే అధికారాన్ని సంబంధిత బ్యాంకులకు ఇచ్చింది ఆర్బీఐ.
  • బ్యాంకులు.. తమ వద్ద ఖాళీగా ఉన్న లాకర్ల జాబితాను బ్రాంచ్​ పరంగా ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలి. అంతేకాక వెయిటింగ్ లిస్ట్​లో ఉన్న లాకర్​ వివరాలనూ ఆ జాబితాలో పొందుపరచాలి.
  • లాకర్ల దరఖాస్తు కోసం ఖాతాదారులు సమర్పించిన పత్రాలను క్షుణ్నంగా పరిశీలించి.. లాకర్లు ఖాళీగా లేకపోతే.. కస్టమర్లకు వెయిట్​లిస్ట్​ నంబర్లు ఇవ్వాలి.
  • తమ వల్ల బ్యాంకు లాకర్​కు ఏదైనా ప్రమాదం జరిగినా, లాకర్లు ధ్వంసమైనా, నష్టం వాటిల్లినా.. సంబంధిత బ్యాంకులే బాధ్యత వహిస్తాయని వివరిస్తూ.. ఓ పాలనీని తీసుకురావాలని ఆర్​బీఐ సూచించింది.
  • అయితే భూకంపం, వరదలు, ఉరుములు మెరుపులు, పిడుగుపాటు, ఇతర ఏదైనా విపత్తు వాటిల్లి.. లాకర్లు ధ్వంసమైతే సంబంధిత బ్యాంకుల బాధ్యత కాదని.. ఆర్​బీఐ తీసుకొచ్చిన మార్గదర్శకాల్లో ఉంది.
  • ఏదైనా దోపిడీ, అగ్నిప్రమాదం, మోసం జరిగి, లాకర్‌లోని వస్తువులు పోతే.. లాకర్‌ అద్దెకు 100 రెట్ల పరిహారం ఇవ్వాలని ఆర్​బీఐ నిబంధనల్లో ఉంది.

ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకుల లాకర్ల వార్షిక అద్దె రూ. 2వేలు ఉంది. మెట్రో నగరాలు, పట్టణాల్లో రూ. 4వేలు ఉంది. పెద్ద లాకర్లకు వార్షిక అద్దె రూ. 8వేలుగా ఉంది. ఈ వార్షిక అద్దెలో జీఎస్​టీ కూడా కస్టమర్లు కట్టాల్సి ఉంటుంది.

ఇవీ చూడండి: ఆభరణాలు ఉన్న బ్యాంక్ లాక‌ర్‌కు బీమా అవ‌స‌ర‌మా?

బ్యాంకు లాకర్ నియమ నిబంధనలు మీకు తెలుసా?

'ఇక బ్యాంకులో ఖాతా లేకున్నా లాకర్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.