ETV Bharat / business

అమెజాన్​లో భారీగా ఉద్యోగాలు- అప్లయ్​ చేశారా? - అమెజాన్​ లేటెస్ట్ న్యూస్​

కరోనా కాలంలోనూ భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది అమెజాన్(Jobs in Amazon). హైదరాబాద్ (Job opportunities in Hyderabad)​ సహా వివిధ నగరాల్లో ఈ ఏడాది చివరి వరకు 8 వేల మందిని ఉద్యోగంలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

Job Openings in Amazon
అమెజాన్​లో ఉద్యోగాలు
author img

By

Published : Sep 2, 2021, 1:10 PM IST

అమెరికాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్​ (Amazon India) భారీగా ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 35 నగరాల్లో 8 వేల మందికి పైగా సిబ్బందిని ఈ ఏడాదే నియమించుకోనున్నట్లు తెలిపింది. కార్పొరేట్​, టెక్నాలజీ, కస్టమర్​ సర్వీస్​, అపరేషన్స్​ వంటి విభాగాల్లోకి వీరిని తీసుకోనున్నట్లు (Amazon Hiring) తెలిపింది.

ఉద్యోగ అవకాశాలు ఉన్న నగరాల్లో ప్రధానంగా హైదరాబాద్(Job opportunities in Hyderabad)​, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్​, ముంబయి, కోల్​కతా, అహ్మదాబాద్​, కోయంబత్తూర్​, పుణె, భోపాల్​లు ఉన్నాయి.

దీనితో పాటు దేశవ్యాప్తంగా 2025 నాటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని అమెజాన్​ పేర్కొంది. ఇప్పటికే 10 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు వివరించింది. కరోనా సమయంలో 3 లక్షల మందికి (ప్రత్యక్షంగా, పరోక్షంగా) ఉపాధి కల్పించినట్లు పేర్కొంది అమెజాన్. ఈ సమయంలో నియామక ప్రక్రియ పూర్తిగా ఆన్​లైన్​ ద్వారానే జరిగినట్లు స్పష్టం చేసింది.

అంతర్జాతీయంగానూ భారీగా ఉద్యోగాలు..

రాబోయే నెలల్లో అంతర్జాతీయంగా కూడా కార్పొరేట్‌, టెక్నాలజీ విభాగాల్లో.. 55,000 మంది ఉద్యోగులను నియమించుకోడానికి అమెజాన్‌ సన్నాహాలు చేస్తోంది. ఇందులో 40,000కు పైగా ఉద్యోగాలు అమెరికాలోనే ఉండటం గమనార్హం. ఈనెల 16న 'అమెజాన్‌ కెరీర్‌ డే' జాబ్‌ ఫెయిర్‌ (Amazon job fair) ద్వారా సంస్థ ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. అమెజాన్‌.జాబ్స్‌/ఇన్‌ వెబ్​సైట్​లో పూర్తి సమాచారం పొందొచ్చు. అన్ని రకాల ఉద్యోగాలకు ఎంపికలుంటాయని, అనుభవంతో పనిలేదని అమెజాన్​ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: Job Alert: నిరుద్యోగులకు శుభవార్త- భారీగా ఉద్యోగాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.