ETV Bharat / business

అమెజాన్​లోనూ ఇక మద్యం హోం డెలివరీ!

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మద్యం హోం డెలివరీకి సిద్ధమైంది. ఇందుకోసం అమెజాన్​కు బంగాల్​ ప్రభుత్వం అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. నిత్యావసరాల హోం డెలివరీ సంస్థ బిగ్​బాస్కెట్​కూ ఈ తరహా సేవలకు అనుమతి లభించినట్లు సమాచారం.

author img

By

Published : Jun 23, 2020, 12:46 PM IST

liquor sales in Amazon
అమెజాన్​లో మద్యం హోం డెలివరీ

కరోనా వ్యాప్తి, లాక్​డౌన్ నిబంధనలతో దేశవ్యాప్తంగా ఇటీవల మద్యం హోం డెలివరీకి డిమాండ్ పెరిగింది. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్​ డెలివరీ సంస్థలు దీనిని అందిపుచ్చుకుని.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ తరహా సేవలు అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం 'అమెజాన్' మద్యం హోం డెలివరీ సేవలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు అమెజాన్​కు బంగాల్​ ప్రభుత్వం నుంచి అనుమతులు లభించినట్లు సమాచారం.

ఎప్పటి నుంచో భారత్​లో మద్యం హోం డెలివరీ సేవల అనుమతి కోసం ప్రయత్నిస్తున్న అమెజాన్​కు.. దీనితో మార్గం సుగమమైంది.

బిగ్​బాస్కెట్​కూ అనుమతులు!

అమెజాన్​తో పాటు నిత్యావసరాల హోం డెలివరీ సంస్థ బిగ్​ బాస్కెట్​కూ మద్యం అమ్మకాలకు బంగాల్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయితే త్వరలోనే అమెజాన్, బిగ్​బాస్కెట్​లు మద్యం హోం డెలివరీలు ప్రారంభించే అవకాశాలున్నాయి.

ఇప్పటికే ఝార్ఖండ్, ఒడిశా, బంగాల్​లో స్విగ్గీ, జొమాటో మద్యం హోం డెలివరీ సేవలు అందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు ఈ తరహా సేవలు అందించేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి.

ఇదీ చూడండి:దేశ ఆర్థిక వ్యవస్థపై లాక్​డౌన్​ ప్రభావం ఎంతంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.