ETV Bharat / business

పుడమి రక్షణ దిశగా అమెజాన్​, యాపిల్​, మహీంద్రా జట్టు!

సున్నా కర్బన సాంకేతికత వైపు పనిచేయడానికి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలైన అమెజాన్‌, యాపిల్‌లతో పాటు భారత్‌ నుంచి మహీంద్రా గ్రూప్‌, దాల్మియా సిమెంట్‌(భారత్‌)లు సిద్ధమయ్యాయి. ఇందుకోసం.. గ్లాస్గోలో జరుగుతున్న కాప్‌26 సదస్సు వేదికగా 'ఫస్ట్‌ మూవర్స్‌ కొయిలేషన్‌'లో వ్యవస్థాపక సభ్యులుగా చేరాయి.

First Movers Coalition
ఫస్ట్‌ మూవర్స్‌ కొయిలేషన్‌
author img

By

Published : Nov 6, 2021, 5:43 AM IST

అంతర్జాతీయ దిగ్గజ సంస్థలైన అమెజాన్‌, యాపిల్‌లతో పాటు భారత్‌ నుంచి మహీంద్రా గ్రూప్‌, దాల్మియా సిమెంట్‌(భారత్‌)లు సున్నా కర్బన సాంకేతికత వైపు పనిచేయడానికి సిద్ధమయ్యాయి. ఇందు కోసం 'ఫస్ట్‌ మూవర్స్‌ కొయిలేషన్‌'లో వ్యవస్థాపక సభ్యులుగా ఈ కంపెనీలూ చేరాయని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) వెల్లడించింది. గ్లాస్గోలో జరుగుతున్న కాప్‌26 సదస్సులో ఈ సమాఖ్య ఏర్పాటు జరిగింది.

2050 పర్యావరణ లక్ష్యాలను చేరాలంటే సగం వరకు ఉద్గారాల తగ్గింపునకు సాంకేతిక అభివృద్ధి, ప్రొటోటైప్‌ దశలపైనే ఆధారపడాల్సి ఉంది. అదే సమయంలో ఈ దశాబ్దంలో ఈ సాంకేతికతలను మార్కెట్లోకి తక్కువ ధరకే తీసుకురావడం చాలా కీలకం. ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం అమెరికా అధ్యక్ష ప్రత్యేక రాయబారి(పర్యావరణం) జాన్‌ కెర్రీతో కలిసి డబ్ల్యూఈఎఫ్‌ ఇక్కడ ఫస్ట్‌ మూవర్స్‌ కొయిలేషన్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ప్లాట్‌ఫాం ద్వారా తక్కువ కర్బన సాంకేతికతకు సరికొత్త మార్కెట్‌ గిరాకీని సృష్టించే కొనుగోలు ఒప్పందాలను కంపెనీలు కుదుర్చుకోవడానికి వీలవుతుంది. ఈ ఒప్పందాల ద్వారా ఆయా సంస్థలు కర్బన నియంత్రణ సాంకేతికతను వాణిజ్యీకరణ చేయాల్సి ఉంటుంది. ఈ సాంకేతిక పరిష్కారాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ దశాబ్దంలో పలు మైలురాళ్లను అధిగమించేలా ఈ సమాఖ్య దీర్ఘకాల ప్రభావం చూపగలదని భావిస్తున్నారు.

8 రంగాలపై..

మొత్తం ఎనిమిది రంగాలపై ఈ సమాఖ్య దృష్టి సారిస్తుంది.

  • ఉక్కు, సిమెంటు, అల్యూమినియం, రసాయనాలు, నౌకాయానం, పౌర విమానయానం, ట్రక్కింగ్‌.. రంగాలు మొత్తం అంతర్జాతీయ కర్బన ఉద్గారాల్లో మూడో వంతుకు కారణమవుతున్నాయి.
  • ఈ రంగాలు వినియోగిస్తున్న సంప్రదాయ ఇంధనాలకు ప్రత్యామ్నాయ.. స్వచ్ఛ ఇంధనాలు ఇంకా రాలేదు.
  • ఎనిమిదో రంగం..'డైరెక్ట్‌ ఎయిర్‌ కాప్చర్‌' దీని ద్వారా సున్నా అంతర్జాతీయ ఉద్గారాలను సాధించడం కోసం వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయులను తగ్గిస్తారు.

వ్యవస్థాపక సభ్య కంపెనీలు

  1. ఏజిలిటీ
  2. ఎయిర్‌బస్‌నీ అమెజాన్‌
  3. యాపిల్‌
  4. బెయిన్‌ అండ్‌ కంపెనీ
  5. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా
  6. బోయింగ్‌
  7. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌
  8. దాల్మియా సిమెంట్‌(భారత్‌)
  9. డెల్టా ఎయిర్‌లైన్స్‌
  10. మహీంద్రా గ్రూప్‌
  11. నోకియా
  12. రెన్యూ పవర్‌
  13. సేల్స్‌ఫోర్స్‌
  14. యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌
  15. వోల్వో గ్రూప్‌
  16. యారా ఇంటర్నేషనల్‌

భారత్‌ ప్రకటనను స్వాగతించిన ఐఎమ్‌ఎఫ్‌

కాప్‌26 సదస్సులో భారత్‌ చేసిన ప్రకటనను ఐఎమ్‌ఎఫ్‌ స్వాగతించింది. భారత్‌ తీసుకుంటున్న చర్యలు ఇతర వర్థమాన ఆర్థిక వ్యవస్థలకు ఉత్ప్రేరకంగా పనిచేయగలవని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎమ్‌ఎఫ్‌) కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ గెర్రీ రైస్‌ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో కర్బన తీవ్రతను తగ్గించుకోవడానికి కాప్‌26లో భారత్‌ ప్రకటించిన చర్యలను స్వాగతిస్తున్నామన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.