ETV Bharat / business

'భారత్​లోని 52% కంపెనీలపై సైబర్​ దాడులు'

author img

By

Published : Mar 31, 2021, 5:18 AM IST

సైబర్​ భద్రత కోసం నిధులు కేటాయించినప్పటికీ.. గత 12 నెలల్లో భారత్​లోని 52 శాతం కంపెనీలు సైబర్​ దాడికి గురయ్యాయి. తమపై తీవ్రమైన లేదా అతి తీవ్రమైన దాడులు జరిగాయని 71 శాతం కంపెనీలు అంచనా వేశాయి. ఈ మేరకు సోఫోస్​ జరిపిన ఓ సర్వేలో తేలింది.

cyber attacks
'భారత్​లోని 52% కంపెనీలపై సైబర్​ దాడులు'

గత 12 నెలల్లో తాము సైబర్ దాడికి గురైనట్లు 52% కంపెనీలు తెలిపాయని, ఇవన్నీ సైబర్ భద్రత కోసం నిధులు కేటాయించిన సంస్థలేనని సోఫోస్ తన 'ద ఫ్యూచర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఇన్ ఏషియా పసిఫిక్ అండ్ జపాన్' సర్వేలో వెల్లడించింది.

సోఫోస్ సర్వే ప్రకారం...

  • సైబర్ భద్రత కోసం కంపెనీలు బడ్జెట్లు పెంచడం లేదు. సైబర్ దాడులు కలిగించే ప్రమాద స్థాయిని అవి సరిగ్గా అంచనా వేయలేక పోతున్నాయి. తీవ్రమైన లేదా అతి తీవ్రమైన దాడులు జరిగాయని 71 శాతం కంపెనీలు అంచనా వేశాయి.
  • భారత్ లో భద్రతా బడ్జెట్ ఉన్న కంపెనీల శాతం ఎక్కువే. వచ్చే 24 నెలల్లో సాంకేతిక బడ్జెట్ల సగటు ప్రస్తుత 9 శాతం నుంచి 10 శాతానికి పెరగొచ్చు. వచ్చే 24 నెలల్లో మాల్వేర్, కృత్రిమ మేధ/మెషీన్ లెర్నింగ్ ఆధారిత దాడులు కంపెనీ సైబర్ భద్రతకు తీవ్ర విఘాతాన్ని కలిగించవచ్చు.

ఇదీ చూడండి:ఆటో డెబిట్​ సేవలకు ఇక కొత్త రూల్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.