ETV Bharat / business

దేశంలో 40% రెస్టారెంట్లు శాశ్వతంగా మూత!

కొవిడ్​తో కుదేలైన రెస్టారెంట్ల వ్యాపారాలు.. కరోనా ముందున్న స్థాయికి చేరేందుకు ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది. కరోనా సంక్షోభంతో ఇప్పటికే 10 శాతం రెస్టారెంట్లు శాశ్వతంగా ముతపడ్డాయి. మరో 30 శాతం రెస్టారెంట్లు మూతపడొచ్చని.. ఆన్​లైన్​ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సర్వేలో తెలిసింది.

40% restaurants to in india
రెస్టారెట్ల వ్యాపారాలపై కరోనా ప్రభావం
author img

By

Published : Aug 20, 2020, 5:37 PM IST

కరోనా వల్ల నెలకొన్న భయాలు, లాక్​డౌన్ వంటి ఆంక్షలతో రెస్టారెంట్ల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అన్​లాక్​ తర్వత.. రెస్టారెంట్లపై ఆధారపడి ప్రధానంగా సేవలందించే ఆన్​లైన్ ఫుడ్​ డెలివరీ వ్యాపారాలు.. నెమ్మదిగా తేరుకుంటున్నాయి. అయితే రెస్టారెంట్ల డైనింగ్ వ్యాపారాలు మాత్రం ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ప్రముఖ ఆన్​లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో చేసిన తాజా సర్వేలో ఈ విషయం తెలిసింది.

సర్వేలో ముఖ్యాంశాలు..

  • దేశంలో కొవిడ్-19 ముందుతో పోలిస్తే ప్రస్తుతం 10 శాతం రెస్టారెంట్లు మాత్రమే కార్యకలాపాలు పూర్తిగా ప్రారంభించాయి.
  • 70 శాతం రెస్టారెంట్లు ఫుడ్​డెలివరీ సేవలు ప్రారంభించాయి. వీటిలో 5 శాతం గతంలో ఆన్​లైన్ ఫుడ్​ డెలివరీకి మొగ్గుచూపని రెస్టారెంట్లు ఉన్నాయి.
  • దేశవ్యాప్తంగా 83 శాతం రెస్టారెంట్ల డైనింగ్​ వ్యాపారాలు ప్రారంభం కాలేదు. వీటిలో 10 శాతం రెస్టారెంట్లు ఇప్పటికే పూర్తిగా మూతపడ్డాయి.
  • మిగతా 73 శాతం రెస్టారెంట్లలోనూ.. 30 శాతం పూర్తిగా మూతపడొచ్చు. పరిస్థితులు మెరుగైతే 43 శాతం రెస్టారెంట్ల డైనింగ్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
  • లాక్​డౌన్ ఆంక్షలు ఎత్తేసినా.. పట్టణాల్లో 17 శాతం రెస్టారెంట్లు మాత్రమే డైనింగ్ సదుపాయాలను ప్రారంభించాయి. అవి కూడా తక్కువ సామర్థ్యంతో పని చేస్తున్నాయి.
  • ప్రస్తుత పరిస్థితుల్లో రెస్టారెంట్లలో డైనింగ్​కన్నా.. ఆన్​లైన్​లో ఫుడ్ ఆర్డర్​ ఇచ్చేందుకే వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు.
  • ఆన్​లైన్ ఫుడ్ డెలివరీ వ్యాపారాలు 75-80 శాతం వరకు రికవరీ సాధించాయి. మరో 2-3 నెలల్లో కరోనాకు మందున్న స్థాయికి ఆన్​లైన్​ ఫుడ్​డెలివరీ వ్యాపారాలు రికవరీ సాధిస్తాయని అంచనా.
  • కార్యాలయాలు ఉండే ప్రాంతాలతో పోలిస్తే నివాసిత ప్రాంతాల్లో ఫుడ్​ డెలివరీ వ్యాపారాలు ఎక్కువగా రికవరీ అయ్యాయి. వర్క్​ ఫ్రం హోం వంటివి ఇందుకు కారణం.
  • లాక్​డౌన్ ప్రారంభమైనప్పటినుంచి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు జొమాటో 7 కోట్ల ఆన్​లైన్​ ఫుడ్ ఆర్డర్లు డెలివరీ చేసింది.

ఇదీ చూడండి:భారత మార్కెట్​కు హార్లీ డేవిడ్​సన్​ గుడ్​బై!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.