భారీ ఎత్తున ప్రజలు ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని కాపాడారని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గించేందుకు తెదేపా నాయకులు కుట్రలు పన్నారని ఆరోపించారు. ఓడిపోతారనే భయంతో బురద చల్లాలని చూస్తున్నారని అన్నారు. 80 శాతం ప్రజలు సంతృప్తి చెందినా.. వీవీ ప్యాట్లపై ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి: ఈవీఎం ధ్వంసం చేసిన వైకాపా అభ్యర్థి.. గ్రామస్థుల దాడి