విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన మృతులకు సంతాపం తెలిపింది ఐక్యరాజ్యసమితి. 12 మంది మృతికి కారణమైన ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. భారత అధికారులు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు.
"మృతులకు సంతాపం తెలుపుతున్నాం. ఘటనతో ప్రభావితమైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. ఇలాంటి ఘటనలపై సమగ్ర దర్యాప్తులు జరగాలి."
-స్టెఫానీ డుజారెక్, ఐరాస అధికార ప్రతినిధి
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకై గురువారం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.
ఇదీ చూడండి: కళ్లు తెరవక ముందే కమ్మేసింది విషవాయు మేఘం