రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు... మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. గుంటూరు జిల్లా పేరేచర్ల - ఫిరంగిపురం మార్గమధ్యంలో ఓ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తక్షణమే స్పందించారు. క్షతగాత్రునికి ప్రథమచికిత్స చేయించి.. సకాలంలో అంబులెన్స్‌ను రప్పించారు. ఆసుపత్రికి పంపించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.
ఇవీ చదవండి...కారుతో ఢీ కొట్టి.. ఆటోలో వెళ్లిపోయిన... ఆ ఎమ్మెల్యే.. !